కొత్త జిల్లాల పేరుతో జగన్ ప్రభుత్వం తెగ హడావిడి చేస్తుంది. అయితే ఈ విభజన ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. దీని పై డ్రాప్ నోటిఫికేషన్ మాత్రం ఇచ్చింది . ఇది ఇచ్చిన వెంటనే అన్ని చోట్ల జిల్లాల పేర్లు తమ ఊరిదే పెట్టాలని ఎవరికీ వారు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. జగన్ సొంత జిల్లా అయిన కడపలో, అనంతపురంలో, కర్నూల్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జిల్లాల విభజన పై జగన్ నిన్న అధికారులతో రివ్యు మీటింగ్ చేసారు. అయితే కొత్త జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని జగన్ అధికారులకు ఆదేశించారు. అయితే మొదట ఉగాది నుంచి ఈ రిజిస్ట్రేషన్ విలువ పెంచుతామని చెప్పినా, మళ్ళి ఇప్పుడు ఈ లోపలే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని, దీనికి వెంటనే నోటీసులు జారి చేయాలని అడికారులని జగన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా వారం రోజుల్లోనే జరిగి పోవాలని అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట . కొత్త జిల్లాల్లో భూములు ,స్థలాలు, భవనాలు రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రత్యేక అనుమతినిస్తూ,వెంటనే నోటిఫికేషన్ జారీ చేసారు. ఇంత హడావిడిగా, ఎందుకు చేసారు, ఎందుకు ఇంత అంటే, పెద్ద కధే ఉంది.

jagan 1 11022022 2

ఈ నెల 13 తేది నాటికి రిజిస్ట్రేషన్ విలువల పెంచటానికి ప్రతిపాదనలు ,14 వ తారీఖున కమిటీ ల ఆమోదం ,15న రిజిస్ట్రేషన్ చార్జీల సమాచారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నోటీసు బోర్డులలో సమాచారం ఉంచటం ,17 న అభ్యంతరాలు, 18 న పరిష్కారం ,19 నాటికి తుది ఆమోదం పొందాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ప్రభుత్వం ఇదంతా ఎందుకు చేస్తుందంటే కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటుందని విమర్శిస్తున్నారు. ఇంకా కొత్త జిల్లాలు అమల్లోకే రాలేదు. కాని ఇప్పుడేమో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులను పరుగులు తీయిస్తున్నారు . మొత్తానికి ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే డబ్బులు వచ్చే ఏ మార్గాన్ని కూడా ఈ ప్రభుత్వం వదులుకోవడం లేదు. పైగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, దాని గురించి ఎవరైన ప్రశ్నిస్తే అభివృద్ది కార్యక్రమాలు చేయడానికే ఇలా చేస్తున్నాం అని సమర్ధించుకుంటున్నారు. కాని ఇలాంటివి చేయడం భావితరాల భవిష్యత్ కు ఏ మాత్రం మంచిది కాదని, ఇలా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం ఇంతవరకు ఎక్కడా చూడలేదని , విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read