ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెరాయిన్ వ్యవహారం, కుదిపేస్తుంది. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో, హెరాయిన్ పట్టుబడటం, అది విజయవాడ అడ్డ్రెస్ తో ఉన్న కంపెనీకి రావటంతో, మొత్తం వ్యవహారం మలుపు తిరిగింది. ఆఫ్ఘన్ నుంచి విజయవాడకు ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ రావటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే డీజీపీ కూడా స్పందిస్తూ, కేవలం అడ్డ్రెస్ మాత్రమే విజయవాడ అని ఉందని, అంతకు మించి ఏపితో సంబంధం లేదని అన్నారు. అయితే దీని పై జాతీయ మీడియాలో వస్తున్న కధనాలతో, ప్రతిపక్ష టిడిపి పార్టీ మాత్రం, విమర్శలు గుప్పిస్తుంది. ఈ రోజు ఒక ప్రముఖ జాతీయ దినపత్రికలో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, తెలంగాణా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు, ప్రచురించింది. ఏపి నుంచి వచ్చే వాహనాల పై, తెలంగాణ బోర్డర్ లో నిఘా పెంచాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.
ఇదే విషయన్ని టిడిపి లేవనెత్తింది. ఒక పక్క ప్రభుత్వం కాని, డీజీపీ కాని, తమకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నారని, అయితే కేంద్రం అధికారులు మాత్రం, తెలంగాణా రాష్ట్రాన్ని అలెర్ట్ చేయటం ఏ విధంగా చూడాలి అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. అలాగే అసలు ఏపి పోలీసులు ఏమి దర్యాప్తు చేసారని, అసలు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. ఒక పక్క విజయవాడ అడ్డ్రెస్ తో సరుకు వచ్చినట్టు ఉందని, ఇక్కడ కంపెనీ ఉండని, ఇక్కడ వ్యక్తులను కేంద్ర నిఘా సంస్థలు అరెస్ట్ చేసాయని, ఇన్ని అధరాలు ఏపితో లింక్ అయి ఉన్నా, పోలీసులు మాత్రం, ఎలా క్లీన్ చిట్ ఇస్తారు అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. దీని పై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ వచ్చింది అంటే, దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. మరి దీని పై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.