రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఫేక్ ముఖ్యమంత్రని, ఫేక్ ప్రభుత్వమని తొలి నుంచీ టీడీపీ చెబుతూనే ఉందని, ఫేక్ ముఖ్యమంత్రి తన అంకెల గారడీతో మరోసారి అడ్డంగా దొరికిపోయాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "కో-వి-డ్ సందర్భంగా వ్యాక్సినేషన్ కు సంబంధించి, ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చారో, జూన్ లో 1 నుంచి 22వ తేదీవరకు ఎన్ని డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారో చెబుతూ, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వం తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగించాలని చూసింది. ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ లో ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు. అది చూసి ఆశ్చర్యపోయాను. 46.46 మిలియన్లు అంటే 4కోట్ల60లక్షల డోసుల వ్యాక్సిన్లను జూన్ లోనే అందించారని, 5కోట్ల80లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని ఆ ట్వీట్ లోచెప్పారు. మరలా గొప్పగా దానిపై అనుమానం రాకుండా, ఒక్కొక్క వ్యాక్సిన్ వయొల్ ని బ్రహ్మండంగా వాడామని, మైనస్ 6శాతం మాత్రమే వృథా అయ్యాయని కూడాచెప్పారు. ప్రభుత్వానికి దురదృష్టవశాత్తూ ఒక మిలియన్ కి ఎన్ని లక్షలుంటాయని కూడా తెలియదు. సమాచారంలో లక్షలను కోట్లుగా చూపించారు. అదే ట్వీట్ కింద ఉన్నసమాచారాన్ని పరిశీలించాను. జూన్ 1 నుంచి 22వ తేదీ వరకు 58లక్షల74వేల201 డోసులు ఇచ్చినట్టు చెప్పారు. కానీ జూన్ 1 నుంచి 22వరకు ఇచ్చిన వ్యాక్సిన్ల వివరాలను మొత్తం లెక్కిస్తే 39 లక్షల89వేల671 వచ్చింది. కానీ ట్వీట్ కింద తాటికాయంత అక్షరాలతో 58లక్షల 74వేల201 డోసులని రాశారు. దాదాపుగా 19లక్షలు పెంచేశారు. ఎన్నివ్యాక్సిన్ డోసులు వచ్చాయనేది కూడా పరిశీలిద్దాం. 46లక్షల46వేల400 డోసులు వచ్చాయంటున్నారు. వచ్చిన డోసులన్నీ కూడితే మాకు వచ్చిన లెక్క 41లక్షల10,530. జూన్ 1 కి అంతకు ముందు నెలలో మిగిలిన స్టాక్ ఉంటుంది కదా అని భావించి, ఆ లెక్క కూడా బయటకు తీశాం. మే నెలకి సంబంధించి జూన్ 1కి, 59వేల ఓపెనింగ్ స్టాక్ మాత్రమే ఉంది. అది కూడా కలిపితే 41లక్షల69వేలు మాత్రమే అవుతుంది. కానీ వీరు ఎంత చెబుతున్నారయ్యా....46లక్షల46వేలు. అంటే 5లక్షల 25వేల వరకు కలిపారు. ఇచ్చిన వ్యాక్సినేషన్ డోసుల్లోనేమో 19లక్షల వరకు కలిపారు.. ఈరకంగా ప్రజలకు ఏదో ఒకటిచెబితే సరిపోతుంది అనుకుంటున్నారా?

ఫేక్ ముఖ్యమంత్రికి లెక్కలు, కూడికలు, తీసివేతలు రాకపోతే మాకు రావా? ప్రజలు మరీ అంత గొర్రెల్లా కనిపిస్తున్నారా ఫేక్ ప్రభుత్వానికి? జూన్ 1 నుంచి 22వరకు వాస్తవంగా ఇచ్చిన వ్యాక్సిన్లు 39లక్షల 89వేలయితే, 58లక్షల74వేలని రాస్తారా? ఇష్టమొచ్చినట్లు ట్వీట్లుపెడతారా? వచ్చిన వ్యాక్సిన్లు ఓపెనింగ్ బ్యాలెన్స్ కలిపినాకూడా 41లక్షల69వేలైతే, 46లక్షల 46వేలని చెబుతారా? వచ్చిన డోసుల్లో, ప్రజలకు ఇచ్చిన డోసుల్లో అంతా ఫేక్ లెక్కలే. ఇవి ఎప్పుడైతే ప్రజల ముందుంచామో.. వెంటనే ట్వీట్ తీసేశారు. దొంగలెక్కలు బయట పడేసరికి వెబ్ సైట్ లోని అంకెలు తొలగిస్తారా? కానీ ఇప్పటికే వాటిని టీడీపీ ప్రజలముందు ఉంచేసింది. ఫేక్ ప్రభుత్వం చెప్పే ఫేక్ లెక్కలను ప్రజలు నమ్మవద్దని కోరుతున్నాం. మేమేనెంబర్ 1 అంటూ ప్రజలను మోసగించే పనిలో ఉన్నారు. దాదాపు 19లక్షల వ్యాక్సిన్ డోసులు ప్రజలకు ఇవ్వకుండానే ఇచ్చేశామని దొంగ లెక్కలతో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. తలసరిన జూన్ 21వతేదీన ఎన్నిడోసులిచ్చారో అదికూడా చూద్దాం. జూన్ 21న తలసరిన 0.17శాతం మాత్రమే డోసులిచ్చారు. అది దేశ స్థాయిలో రాష్ట్రాన్ని 22వ స్థానానికి దిగజార్చింది. ఇదేనా ముఖ్యమంత్రి ప్రతాపం, సమర్థత? జూన్ 20వతేదీన తామే నెంబర్ 1 అనిచెప్పారు కదా? జూన్ 21నాటికే 22వస్థానానికి ఎలా పడిపోయారు? పర్ కేపిటా డోసుల్లో 22వస్థానానికి ఎందుకు పడిపోయామో కూడా ముఖ్యమంత్రే ప్రజలకు సమాధానంచెప్పాలి. ప్రభుత్వమిచ్చే తప్పుడు లెక్కలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరుతున్నాం. తొలి డోసు, రెండో డోసు ఇవ్వడంలో రాష్ట్రం అనేక విధాలా వెనుకబడే ఉంది. ఆరోగ్యఆంధ్రా ట్విట్టర్ అకౌంట్ తో, తప్పుడు లెక్కలతో ముఖ్యమంత్రి ప్రజలను మోసగించాలని చూస్తున్నాడు. బాధ్యతగల ప్రతిపక్షం ముఖ్యమంత్రి ఫేక్ లెక్కలను ఆధారాలతో సహా బయటపెట్టింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read