వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమైందని, ప్రజలు గంజాయి, ఇతరత్రా డ్ర-గ్స్ గురించి మొత్తుకున్నా కూడా పాలకులు సకాలంలో స్పందించకపోగా, ప్రశ్నించిన టీడీపీ నేతలు,ఇతరులపై కేసులు పెట్టారని, మాదక ద్రవ్యాలను నియంత్రించి యువతను, రాష్ట్ర భవిష్యత్ ను కాపాడకుండా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రివర్యులు నిమ్మకాయల చినరాజప్ప స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! తెలుగుదేశం పార్టీ సహా, ఇతర పార్టీలు తొలి నుంచి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యాప్తి రాష్ట్రంలో పెరిగిందని చెప్పినా పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం పెడచెవిన పెట్టాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి, ముఖ్యమంత్రిని నిలదీశామన్న అక్కసుతో ఆఖరికి టీడీపీ కార్యాలయం పై కూడా దా-డి-కి తెగబడ్డారు. ప్రభుత్వ పని తీరు అంతా గాలి వాటంగా ఉండటంతో, రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాలు, మరీ ముఖ్యంగా గంజాయి వంటివి దేశమంతా రవాణా అవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడా గంజాయ సాగు అనేది లేకుండా చేశాము. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, గిరిజనుల సహాయ సహాకారాలతో, ప్రత్యేక బృందాలతో గంజాయి సాగుకి రాష్ట్రంలో చోటు లేకుండా చేశాము. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, వైసీపీ నేతలు గంజాయినే తమ ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. స్వయంగా పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రే ఏపీ నుంచి ఇతరప్రాంతాలకు గంజాయి రవాణా అవుతుందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై ఈ ప్రభుత్వం కాస్తైనా సిగ్గుపడాలికదా? రాష్ట్రంలో గంజాయి వాడకంతో పాటు, మద్యం, నాటాసారా అమ్మకాలు పెరిగాయి. మాదకద్రవ్యాలను ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుండటంతో మహిళలపై దారుణాలు అధికమయ్యాయి.

j 03122021 2

పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గంజాయి సాగుతో పాటు, మాదక ద్రవ్యాల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. 2018లో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు చాటు మాటుగా 33,900 కిలోల గంజాయి స్మగ్లింగ్ జరిగితే, అది 2020 నాటికి లక్షా 06 వేల 400 కిలోలకు పెరిగింది. 2018లో మాదకద్రవ్యాల బారిన పడి 196 మంది చనిపోతే, 2020లో మృతుల సంఖ్య 380కు చేరింది. అలానే కేసుల నమోదులో 2018లో 504కేసులు నమోదైతే, 2020లో 866కేసులు నమోదయ్యాయి. గంజాయి రవాణా, సాగు ఇతర వ్యవహారాల్లో 2018లో 175మందికి శిక్షలు పడితే, 2020లో కేవలం 22 మందిని మాత్రమే శిక్షించారు. పోలీస్ స్టేషన్లలో కేసులు సరిగా నమోదు చేయకపోవడం, పట్టుబడిన వారిని అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేయడంతో కేసుల సంఖ్యతో పాటు శిక్షలుపడిన ఘటనలు బాగా తగ్గాయి. 2018లో 1638 కేసులు నమోదైతే, 2020లో 1569 కేసులు మాత్రమే నమోదు చేశారు. చాలా చోట్ల నమోదైన కేసుల్లో ఎలాంటి శిక్షలు పడలేదు. రాష్ట్రం నుంచి గంజాయి ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతోందంటే అందుకు ప్రధాన కారణం అధికార పార్టీ నేతల అండదండలే. మద్యాన్ని ప్రభుత్వం ప్రధాన ఆదాయవనరుగా మార్చుకుంది. మద్యంద్వారా ఏటా రూ.20 వేల కోట్లఆదాయం వస్తోందని ప్రభుత్వమే చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read