వివేకానందరెడ్డి కేసువిచారణలో సునీతమ్మ ఢిల్లీకేంద్రంగా చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టిసారించడం లేదని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో పూలు, పాలు, పండ్లు అమ్మేవాళ్లను విచారిస్తున్న సీబీఐ, కేసులో ప్రజలందరూ అనుమానిస్తున్న అసలు అనుమానితులను, సునీతమ్మ చేసిన ఆరోపణలపై ఎందుకు విచారించడంలేదో సమాధానం చెప్పాలని రఫీ డిమాండ్ చేశారు. హ-త్య-తో తమ కుటుంబసభ్యలు ప్రమేయం ఉందని సునీతమ్మ అనుమానం వ్యక్తంచేశారని, వై.ఎస్. భాస్కర్ రెడ్డి, కడప ఎంపీగా ఉన్న వై.ఎస్. అవినాశ్ రెడ్డిలపైనే అనుమానంగా ఉందని ఆమె స్పష్టంగా చెప్పాక కూడా సీబీఐ వారిని ఎందుకు విచారించడం లేదన్నారు? సునీతమ్మ అనుమానించిన వ్యక్తులకు సీబీఐ తక్షణమే లైడిటెక్టర్, నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని టీడీపీ తరుపున తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. పూలు పాలు, పండ్లు అమ్మేవాళ్లను విచారించాల్సిన అవసరంలేదని, ఒక పెద్ద రాజప్రాసాదంలో కుట్రతో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన విచారణలో జాప్యం చేయడమేంటన్నారు. వివేకాను చం-పి-న-వా-రె-వ-రు, శ-వా-ని-కి కుట్లువేసిన వారెవరు.... ర-క్త-పు మడుగుని తుడిచిందెవరు అనేటువంటి అనుమానాలు ప్రజలందరిలోఉన్నాయన్నారు. శ-వా-ని-కి కుట్లువేసిందిఎవరు... ఎవరి అవసరాల కోసం, ఎవరి ప్రయోజనాలకోసం ఆయన ఆపనిచేశాడో సీబీఐ ఎందుకు తేల్చలేక పోయందని రఫీ డిమాండ్ చేశారు. హ-త్య జరిగితే శ-వా-న్ని ఎక్కడి దాన్నక్కడే ఉంచాలని, కానీ దాన్ని మంచం మీదకు మార్చడం, కుట్లువేయడం జరిగిపోయిం దన్నారు. అవన్నీ ఎవరుచేశారనే విచారణలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని రఫీ అభిప్రాయపడ్డారు.
మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి హ-త్య-తో సంబంధముం దని, విజయమ్మ తనలేఖలో ప్రస్తావించడం జరిగిందని, దానికి ఆయన హ-త్య-తో తనకు సంబంధమున్నట్లు నిరూపిస్తే, ఉ-రే-సు-కుం-టా-న-ని బహిరంగంగానే సవాల్ విసరడం జరిగిందన్నారు. అదేమాదిరిగా సునీతమ్మ చెప్పిన భాస్కర్ రెడ్డి, వై.ఎస్. అవినాశ్ రెడ్డి హ-త్య-తో తమకు సంబంధంలేదని ఎందుకు చెప్పలేకపోతు న్నారని రఫీ నిలదీశారు. తండ్రీ, కొడుకులైన భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు హ-త్య-తో తమకు సంబంధమున్నట్లు రుజువుచేస్తే, తాముకూడా ఉ-రే-సు-కో-వ-డా-ని-కి సిద్ధమని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు? హ-త్య జరిగినప్పుడు నిజానిజాలు నిగ్గుతేల్చడానికి చంద్రబాబునాయడు సిట్ ను నియమిస్తే, హైకోర్ట్ ద్వారా దాన్ని జగన్మోహన్ రెడ్డే అడ్డుకున్నాడని, ఆ విషయం బూతులమంత్రి కొడాలినానీకి, విజయమ్మకు తెలియదా అని రఫీ ప్రశ్నించారు. సిట్ విచారణ కాదు, సీబీఐ విచారణకావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి, తరవాత సీబీఐ విచారణకోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఎందుకు వెనక్కు తీసుకున్నాడో చెప్పాలన్నారు. వివేకా -కే-సు వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి తెలుసునని, ఆయన 14వతేదీన సీబీఐ విచారణకు హాజరవుతారని అందరూ అనుకుంటున్నారని, ఆయన సీబీఐ ముందు హాజరవుతున్నారో లేదో సమాధానం చెప్పాలన్నారు. తిరుపతిలోని రేణిగుంటలో తాను హజరుకావాల్సిన సభను కూడా ముఖ్యమంత్రి అందుకు రద్దుచేసుకున్నాడని ప్రజలందరూ అనుకుంటున్నారన్నారు.