తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,నిన్న చెప్పిన మాట ప్రకారం, భరోసా యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ముందుగా ఈ నెల 5 వ తారీఖున ప్రకాశం జిల్లా, చినగంజాం మండలం రుద్రమాంబపురం గ్రామాన్ని సందర్శిస్తారు. ఇటీవల వైసీపీ నేతలు, గొడవ జరుగుతున్న సమయంలో, అందరి ముందు టీడీపీ కార్యకర్త పద్మను వివస్త్రను చేసే ప్రయత్నం చేయగా, ఆమె అవమాన భారంగా భావించి, ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ముందుగా ఆమె కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈమేరకు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు క్యాంపు ఆఫీసుకు మంగళవారం సమాచారం అందింది. ఈ నెల 5వ తేదీన రుద్రమాంబపురానికి చంద్రబాబు వస్తున్నారని, మృతిచెందిన పద్మ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని చెప్పారు. అయితే గత పది రోజులుగా, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.

చంద్రబాబు పర్యటన ఖరారు కావటం, ఆయనకు సమాచారం రావటంతో, ఆయన 4వ తేది ఉదయానికి విదేశాల నుంచి తిరిగి వచ్చి, నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 5వ తేదీ ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గాన బయలుదేరాతారు. గుంటూరు, ప్రత్తిపాడు, పర్చూరు, ఇంకొల్లు, కడవ కుదూరు మీదుగా రుద్రమాంబపురం వస్తారు. అక్కడ ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన తరువాత, మధ్యాహ్నం తిరిగి అదే మార్గంలో ఉండవల్లి చేరుకుంటారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటన చెయ్యనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీటీపీ కార్యకర్తల పై వైసీపీ దాడులుచేసిన ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ దౌర్జన్యాలలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పటంతో పాటు, పార్టీ తరుపున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహయం అందించాలని చంద్రబాబు నిర్ణయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read