ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అమరావతిని నిర్వీర్యం చేస్తూ, మూడు రాజధానుల విషయం పై, ప్రభుత్వం ముందుకు వెళ్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని, వైజాగ్ లో సచివాలయం ఉంటుందని, అలాగే కర్నూల్ లో హైకోర్ట్ ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. అయితే, అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అసెంబ్లీలోకి స్పీకర్ తమ్మినేని సీతారం రాగానే, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, 'బ్యాడ్ మార్నింగ్ సార్' అంటూ, ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్ పై నినాదాలు చేసారు. అయితే, దీని పై స్పందించిన స్పీకర్, ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తారని, మంచి జరగాలని కోరుకుంటారని, కాని మీరు ఏమిటి బ్యాడ్ మార్నింగ్ చెప్తారు, ఇలా బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమని స్పీకర్ సమాధానం ఇచ్చారు. దీని పై టిడిపి ఎమ్మెల్యేలు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ రోజు బ్యాడ్ మార్నింగ్ అని అన్నారు.

speaker 20012020 2

ఇక మరో పక్క అసెంబ్లీ జరుగుతూ ఉండగానే, బయట నిరసనలు మిన్నంటాయి. రైతులు , పోలీసులు నిర్బంధాన్ని దాటుకుని వచ్చి, అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేసారు. సచివాలయం రెండో గేటు వద్దకు, దాదాపుగా 2 వేల మంది రైతులు, మహిళలు వచ్చారు. అయితే పోలీసులు విచక్షణారహితంగా వచ్చి, లాఠీచార్జ్ చేసారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా, దొరికిన వారిని దొరికినట్టు, చితకోట్టారు. కొంత మంది పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయారు. పోలీసులు వీరిని తరమటంతో, రైతులు సచివాలయం పక్కన ఉన్న పొలాల్లో, ఎండలోనే కూర్చుని నినాదాలు చేస్తున్నారు. మరో పక్క, పోలీసులు ఇక్కడ నుంచి వీరిని వెళ్ళిపోవాలని కోరుతున్నారు. కొంత మందిని అరెస్ట్ లు చేసారు.

speaker 20012020 3

రాజధాని ప్రాంత రైతుల ఆందోళనల దృష్ట్యా సచివాలయం వద్దకు విజయవాడ నుంచి పోలీసులు అదనపు బలగాలు తరలిస్తున్నారు. రెండు బస్సుల్లో సుమారు 70 మంది పోలీసులను తీసుకొస్తున్నారు. మరోవైపు, రైతులు తమ గ్రామాల నుంచి పొలాలు మీదుగా జాతీయ జెండాలు పట్టుకొని అసెంబ్లీ, సచివాలయం వద్దకు దూసుకొస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జిలో గాయపడినా లెక్కచేయకుండా తమ నిరసన గళాన్ని విన్పించేందుకు అసెంబ్లీ వైపు వచ్చేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మరో పక్క, మంగళగిరి మండలంలోని కృష్ణాయ పాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏపీ కేబినెట్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, రైతు కూలీలు రహదారిని దిగ్బంధించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read