గత వారం గుజరాత్ లోని ముంద్రా పోర్టులో హెరాయిన్ దొరకటం, దాని పైన విజయవాడ అడ్డ్రెస్ ఉండటం, కేంద్ర నిఘా విభాగం, ఇక్కడకు వచ్చి, ఆ కంపెనీ యజమాని అతని భార్యని అదుపులోకి తీసుకోవటం, ఇవన్నీ తెలిసినవే. అయితే ఈ విషయం పై టిడిపి, అధికార పార్టీ పై ప్రశ్నలు సందిస్తుంది. 72 వేల కోట్ల డ్రగ్స్ వ్యాపారం జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని, అతి సామాన్యమైన వాళ్ళు ఇది చేయలేరు కదా, దీని వెనుక ఎవరు ఉన్నారు అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. దీని పై ప్రభుత్వం, వైసీపీ, డీజీపీ కౌంటర్ కూడా ఇచ్చారు. దీంతో రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పేసారు. అయితే ఏ మాత్రం ఎంక్వయిరీ చేయకుండా, ఎలా చెప్తారు అంటూ, టిడిపి ప్రశ్నించింది. ఈ రోజు ట్విట్టర్ లో ఇండియా వైడ్ ట్రెండ్ కూడా , ఈ విషయంలో నడిచింది. ఇది ఇలా ఉంటూ ఉండగానే, టిడిపి చేతికి అతి పెద్ద అస్త్రం దొరికింది. దీంతో టిడిపి నేతలు ఉదయం నుంచి వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిన్న తెలంగాణ పోలీసులు, కొంత మంది గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. ఏపి నుంచి వస్తున్న వారిని తెలంగాణా పోలీసులు పట్టుకున్నారు. అయితే వారిలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మల్యే కుమారుడు కూడా ఉనాడనే ప్రచారం జరిగింది. ఉదయం నుంచి ఈ విషయం పై సోషల్ మీడియాలో కధనాలు వస్తున్నాయి. పత్రికల్లో కూడా విషయం వచ్చింది.
దీంతో టిడిపి కూడా ఈ విషయం పై విమర్శలు చేస్తుంది. అయితే టిడిపి విమర్శలు తగవు అంటూ, ఆ ఎమ్మల్యే అతని మొదటి కొడుకు వీడియో వదిలారు. అయితే టిడిపి మాత్రం, రెండో కుమారుడుని పట్టుకున్నారని, అతను తెలంగాణా పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్తుంది. ఈ విషయం పై మాట్లాడిన టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి, ఏకంగా డ్ర-గ్స్ చాలెంజ్ కూడా చేసారు. ఆ ప్రజాప్రతినిధి రెండో కుమారుడు డ్ర-గ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడని, రేపు ఉదయం హైదాబాద్ లోని ఫోరన్సికి డిపార్ట్మెంట్ లో డ్ర-గ్స్ టెస్ట్ చేపించాలని, అవసరం అయితే తాము అందరం కూడా, టిడిపి నుంచి లీడర్లు అందరూ వచ్చి డ్రగ్స్ చేపిస్తామని చాలెంజ్ చేసారు. టిడిపి నేతల ఛాలెంజ్ తో వాతావరణం వేడెక్కింది. ఇప్పటి వరకు టిడిపి ఛాలెంజ్ కు ఆ ఎమ్మెల్యే అయితే రియాక్ట్ కాలేదు. అలాగే రెండో కుమారుడు కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. మరి దీని పై రాజకీయంగా ఏమి జరుగుతుందో చూడాలి.