2019లో ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేవలం 18 నెలల్లోనే, 150 కోట్లతో నిర్మాణం చేసారు. అయితే ప్రభుత్వం మారటంతో, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటంతో, ఆ ఎయిర్ పోర్ట్ నేనే కట్టాను అంటూ, రెండేళ్ళ తరువాత హడవిడి చేసి, ఈ రోజు ప్రారంభించారు. దీని పై ఈ రోజు టిడిపి కౌంటర్ ఇచ్చింది. టిడిపి శాసన మండలి సభ్యులు, బీటీ నాయుడు ఈ విషయం పై కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, "జగన్మోహన్‌రెడ్డి ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. తెలుగుదేశం హయాంలో పనులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభించిన కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయాన్ని నేడు మళ్లీ జగన్‌రెడ్డి ప్రారంభించి తన ఘనతగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ఆయన వ్యవహారం చూస్తే కొంతకాలం పోయాక కర్నూలు కొండారెడ్డి బురుజును కూడా వైసీపీ హయాంలోనే నిర్మించామంటూ మళ్లీ రిబ్బన్ కట్ చేసినా ఆశ్చర్య పడాల్సిన లేదు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు టిడిపి హయాంలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లో భూసేకరణ, ఇతర పనులను పూర్తిచేసి రికార్డు సమయంలో కర్నూలు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును చంద్రబాబునాయుడుగారు చేతులమీదుగా ప్రారంభించారు. విమానాల పార్కింగ్ కోసం 4 యాప్రాన్‌లు, భారీ కార్గో విమానాలను రాకపోకలకు అవసరమైన సదుపాయాలను కూడా తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. "
"2 కి.మీ. మేర రన్‌వేతో సహా 1000 ఎకరాల్లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తే... ఇప్పుడు జగన్‌రెడ్డి చెల్లి పెళ్లి మళ్ళీ...మళ్ళీ అన్నట్లుగా ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటు. వైసిపి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కొత్తగా ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేసి పూర్తి చేశారా? కర్నూలు విమానాశ్రయం నుంచి విశాఖ, బెంగుళూరు, చెన్నై వంటి పట్టణాలతోపాటు ఇతర దేశాలకు కూడా నేరుగా విమాన సర్వీసులు ఉండేలా చంద్రబాబునాయుడుగారు ప్రణాళికలు రూపొందిస్తే వాటిని నిర్వీర్యం చేసింది జగన్‌రెడ్డి కాదా? గన్నవరం, విశాఖ పట్నం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దింది ఎవరో రాష్ట్రప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం హయాంలో చేసిన పనులకు పేర్లు మార్చడం, రంగులు మార్చడం మాని కొత్తగా రాష్ట్ర అభివృద్ధికి జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తే మంచిది. ప్రపంచంలో ఏ పనినైనా రెండుసార్లు ప్రారంభోత్సవాలు ఏ నాయకుడైనా చేశారా? ప్రారంభించిన వాటినే మళ్లీ ప్రారంభింస్తూ జగన్మోహన రెడ్డి కాలక్షేపం చేస్తున్నారు. చేసేంది శూన్యం..చెప్పేంది కొండంత.
" అంటూ కౌంటర్ ఇచ్చారు.