ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నా, ఇప్పటి వరకు కేంద్రం స్పందించింది లేదు. ఇక మరో పక్క అంతర్వేది లాంటి ఘటనల పై సిబిఐ విచారణ జరిగినా కేంద్రం ముందుకు రాలేదు. అయితే ఏపిలో బీజేపీ మాత్రం, జగన్, చంద్రబాబు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడితే విజయవాడలో గుడులు కూల్చారు అని ప్రచారం చేసింది. అయితే దీని పై అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ సీరియస్ గా స్పందించింది. ఘాటుగా బీజేపీకి బదులు ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాటల్లో, "ఈ రోజు బీజేపీ నయాకులు, మాట్లాడితే మనల్ని విమర్శిస్తున్నారు. మాట్లాడితే మన భజన చేస్తున్నారు. నేను వారికి కూడా, ఈ సమావేశం ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీ బాధ్యత మీరు నిర్వహించాలి. మాట్లాడితే చంద్రబాబు దేవాలయాలు కూల్చుతున్నాడు, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కూల్చుతున్నాడు అంటూ, ఈ రోజు ప్రజలకు మభ్య పెట్టే ప్రచారం బీజేపీ చేస్తుంది. మేము ఎక్కడ కూల్చాం ? మేము ఎప్పుడూ దేవాలయాలు కూల్చలేదు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఒక ఫ్లై ఓవర్ మంజూరు అయితే, అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు, ఆ రోజు ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆయన చనిపోయారు కాబట్టి, ఆయన్ను వివాదంలోకి లాగటం లేదు. ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో ఫ్లై ఓవర్ కు అడ్డంగా ఉన్నటు వంటి, దేవాలయాలను తీసి, ఫ్లై ఓవర్ కడితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కర్కశంగా దేవాలయాలు పడగొడుతుంటే, దానికి దీనికి ముడి పెట్టి మా పై విమర్శలు చేస్తున్న బీజేపీని ఏమనాలో ఒకసారి ఆలోచించుకోవాలి.

achem 08501201 2

"మీ మాటలకు చేతలకు, తేడా లేదు. ప్రసంగాలు పెద్దగా చేస్తున్నారు కానీ, చేతలు మాత్రం ఎక్కడా లేవు. ఈ రోజు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది పార్టీ అభిప్రాయం కాకపోయినా, ఈ వేదిక మీద నుంచి ఒక పౌరుడిగా, ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు బాధ్యత లేదా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. మన దేవాలయాల్లో, వారు వచ్చి క్యులో ఉంటున్నారు. అన్యమత ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు కళ్ళకు కొట్టి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇన్ని చూస్తూ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు ఎందుకు అరికట్టలేదు ? అరికట్ట వలసిన బాధ్యత మీకు లేదా ? ఈ రోజు 140 ఘటనలు జరిగాయి. ఒక క్రీస్టియన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, కేంద్రం ఎందుకు స్పందించటం లేదు ? ఎందుకు ఈ కేసులు సిబిఐకి ఇచ్చి ఎందుకు ఎంక్వయిరీ చేయటం లేదని, మేము బీజేపీని కూడా అడుగుతున్నాను. అప్పుడు మీరు చెప్పే మాటలు, ప్రజలు నమ్ముతారు." అని అచ్చెన్నాయుడు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read