రాష్ట్రంలోని రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, మరీ ముఖ్యంగా ప్రధాన రహదారులు సహా, రాష్ట్రంలోని రోడ్లన్నీ గోతుల మయం అయ్యాయని, రోడ్లపై వరి నాట్లు వేసే దుస్థితి నెలకొందని, వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, రాష్ట్రంలోని రోడ్లన్నీ చెరువులను తలపిచండంతో, ప్రజలంతా చేపలు పడుతూ, వరినాట్లు పడుతూ ప్రభుత్వం కళ్లు తెరిపించేలా నిరసన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...! "రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై తెలుగుదేశంపార్టీ అధ్వర్యంలో గతనెల 28వ తేదీన భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రికి చాలారోజుల తర్వాత రాష్ట్రంలోని రోడ్లు గుర్తుకొచ్చాయి. ఈ రోజున రోడ్ల నిర్మాణం పై సమీక్ష జరిపారని విన్నాం. రోడ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి కొన్నికఠిన నిర్ణయాలు తీసుకున్నారని, పుంగనూరు పుడింగి పచ్చి నేడు మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్పాడు. అలానే తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తిగా రోడ్ల నిర్మాణం పడకేసిందని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎమ్ జీఎస్ వై) పథకం కింద టీడీపీప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 330 కిలోమీటర్లు మాత్రమే రోడ్లనిర్మాణం జరిగిందని మంత్రి పచ్చి అబద్ధాలాడాడు. చంద్రబాబునాయుడు గారు రోడ్ల నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని సిగ్గు లేకుండా వైసీపీవారు ఇప్పటికీ ఆయనపైనే పడి ఏడుస్తున్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎమ్ జీ ఎస్ వై పథకం) కింద టీడీపీ హాయాంలో కేవలం 330 కిలో మీటర్లు మాత్రమే రోడ్లను నిర్మించామన్నారు. సమాచారహక్కు చట్టం కింద 06-01-2021న రాష్ట్ర పంచాయ తీరాజ్ ఇంజనీరింగ్ విభాగం వారు సమాచారమిచ్చారు. 2014 జూన్ నుంచి 2019 మే వరకు పంచాయతీ రాజ్ విభాగం పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారు.. అందుకు అవసరమైన వ్యయమెంత అని తాము సమాచార హక్కు చట్టం కింద అడిగాము.

2014-15లో పీఎమ్ జీఎస్ వై కింద 463.8 కిలోమీటర్లు, 2015-16లో 972.07 కిలోమీటర్లు, 2016-17లో 733.05 కిలోమీటర్లు, 2017-18లో 154.05 కిలోమీటర్లు, 2018-19లో 312.18 కిలోమీటర్లు, మొత్తంగా కలిపి ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వంలో 2,634 కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం జరిగిందని, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ విభాగం వారే చెప్పారు. పుంగనూరు పుడింగి శాఖకు చెందిన వారే చెప్పారు. దీనిపై మంత్రి ఏం సమాధానం చెబుతాడు? తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఈజీఎస్ కింద 2,634 కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం పూర్తయిందని తన శాఖ వారే చెబితే, మంత్రేమో పచ్చి అబద్ధాలు చెప్పారు. అలానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 జూన్ నుంచి పీఎమ్ జీఎస్ వై కింద ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నికిలోమీటర్లు రోడ్లువేశారనే దానిపై కూడా సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగాము. 2019-20 లో 178 కిలోమీటర్లు, 2020-21 లో 118 కిలోమీటర్లు అని చెప్పారు. అంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో వచ్చాక రెండేళ్లలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద కేవలం 296 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారు. ఇవన్నీ పెద్దిరెడ్డికి తెలుసు. చేతిలో బులుగు మీడియా ఉంది కదా అని, దాన్ని అడ్డంపెట్టుకొని పచ్చిఅబద్దాలు చెబుతారా?

Advertisements

Advertisements

Latest Articles

Most Read