సిపిఐ, సిపిఎం పార్టీలు గత నాలుగు ఐదు నెలలుగా, పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్నాయి. ఆంధ్రాలో ఎక్కువగా టచ్ లో ఉన్నాయి. తెలంగాణాలో కూడా మొన్నటి వరకు సానుకూలంగానే ఉన్నారు. అయితే, పవన్ కళ్యాణ్, మోడీ పై ప్రేమ చూపిస్తూ, సీరియస్-నెస్ లేని రాజకీయం చేస్తూ ఉండటంతో, సిపిఐ పార్టీ తెలంగాణాలో నమస్కారం చెప్పేసింది. తెలుగుదేశం పై వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్, కెసిఆర్, మోడీకి అనుకూలంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకుంది. మరో పక్క సిపిఎం మాత్రం, ప్రస్తుతానికి పవన్ తోనే వెళ్ళటానికి డిసైడ్ అయ్యింది. అయితే, ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా పడనుంది. ఇక్కడ కూడా సిపిఐ, పవన్ కు దూరంగా జరిగే అవకాసం ఉంది.
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ కు గుడ్ బై చెప్పి, తెలుగుదేశంతో ఎన్నికలకు వెళ్లి, కెసిఆర్ కి బుద్ధి చెప్పటానికి సిపిఐ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఇరు పార్టీల మధ్య పొత్తు అంశంపై చర్చించారు. అనంతరం, మీడియాతో రమణ మాట్లాడుతూ, రేపు, ఎల్లుండి మిగతా పార్టీలతో మాట్లాడనున్నామని అన్నారు. మంచి వాతావరణంలో తాము చర్చించుకున్నామని, రానున్న రోజుల్లో మహాకూటమి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఏఏ పార్టీలైతే తమతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నాయో వాళ్లతో చర్చలు పెడుతున్నామని, భావసారూప్యత ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ తాము ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజకీయ, నైతిక విలువలు లేవని, అన్ని పార్టీలకు చెందిన నిస్సిగ్గుగా కలుపుకొన్నారని, ఇది కేసీఆర్ మార్క్ రాజకీయమని విమర్శించారు. తెలంగాణలో ఆదర్శవంతమైన పాలన అందిస్తానని చెప్పిన కేసీఆర్, అలాంటి పాలన అందించలేదని.. పేదల గొంతు నొక్కుతున్న పరిపాలన కేసీఆర్ దని విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. తెలంగాణ జన సమితితో కూడా చర్చలు జరుపుతామని, ఇప్పటికే ఆ పార్టీ సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. మిగిలిన పక్షాలతో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు.