2019 ఎన్నికలకు ముందు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అప్పట్లో రాష్ట్ర విభజన ద్వారా మనకు అనేక హామీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మనకు చట్టం కూడా ఒకటి చేసింది. ఆ హామీల అమలు కోసమే, అప్పట్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కలిసింది. అక్కడ కేంద్ర మంత్రులుగా టిడిపి ఉంటే, ఇక్కడ చంద్రబాబు క్యాబినెట్ లో కూడా బీజేపీ ఉంది. అయితే మూడేళ్ళ పాటు చంద్రబాబు ఓపిక పట్టారు. అయినా కేంద్రం నుంచి విభజన హామీల్లో అన్యాయం జరిగింది. పోలవరం నుంచి అమరావతి వరకు, రైల్వే జోన్ నుంచి, వెనుకబడిన జిల్లాలకు నిధులు వరకు, ఇలా ప్రతి దాంట్లో అన్యాయమే జరిగింది. కేంద్రం మోసం చేస్తుందని గ్రహించిన చంద్రబాబు, ప్రజల అభీష్టం మేరకు, కేంద్రం నుంచే కాక, ఎన్డీఏ నుంచి కూడా వైదొలిగారు. ఇది చివరకు రాజకీయ పోరాటంగా కూడా మారటంతో, చంద్రబాబు నరేంద్ర మోడీ పై రాజకీయంగా కూడా ఎదుర్కున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసారు. అయితే చివరకు రాజకీయంగా ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ నరేంద్ర మోడీకి భయపడలేదు. రాష్ట్రం కోసం మోడీనే ఎదిరించారు. అయితే ఇప్పుడు అధికారం మారింది. మెడలు వంచేస్తాను అని చెప్పిన వ్యక్తి మాట్లాడటం లేదు. చంద్రబాబు కూడా పరిస్థితికి తగ్గట్టు, కేంద్రాన్ని విభేదించటం, సమర్ధించటం చేస్తున్నారు.
దేశానికి మంచి అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు, చెడు అనుకుంటే వ్యతిరేకేస్తున్నారు. ఇదే విషయం నిన్న జరిగిన మహానాడులో కూడా టిడిపి చర్చించింది. దేశానికి, ప్రజలకు మంచి అనుకున్న అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, చెడు చేస్తుంది అనుకుంటే వ్యతిరేకించాలని తీర్మానించారు. ఇది పట్టుకుని బులుగు మీడియా, చంద్రబాబు, బీజేపీతో కలుస్తున్నారు అంటూ ప్రచారం చేసింది. అంతే కాదు, బీజేపీ నేత, సునీల్ దియోధర్ కూడా, చంద్రబాబు మాతో కలుస్తాం అంటున్నారు, మేము కలవం అంటూ ట్వీట్ చేసారు. అక్కడ చంద్రబాబు చెప్పింది, దేశానికి మంచి అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం, చెడు అనుకుంటే వ్యతిరేకిస్తాం అని. ఏ పార్టీ అయినా అదే కదా పార్లమెంట్ లో చేసేది ? ఇందులో తప్పు ఏముంది ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దేశం మొత్తం వ్యతిరేకించిన రైతు చట్టాలకు మద్దతు ఇవ్వలేదా ? వారికి ఆ అంశం నచ్చింది కాబట్టి, మద్దతు ఇచ్చారు. అంటే వారు బీజేపీతో కలుస్తారా ? అలాగే మొన్న కాంగ్రెస్ కూడా, ఒక అంశంలో బీజేపీ నిర్ణయాన్ని దేశం కోసం సమర్ధించింది. వాస్తవం ఇలా ఉంటే, బులుగు మీడియా ప్రచారం ఇది అంటూ, టిడిపి వాస్తవంగా అక్కడ ఏమి జరిగిందో చెప్తూ ఒక వీడియో విడుదల చేసింది. మరి ఈ బులుగు బ్యాచ్ ఇప్పుడైనా ఆపుతారో లేదో.