రాష్ట్రంలో అనేకమంది ముఖ్యమంత్రులను చూశామని, జగన్ అధికారంలోకివచ్చాక ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో హిందూ మతమే లక్ష్యంగా 161 వరకు ఘటనలు జరిగాయని, అవన్నీ వాస్తవమోకాదో ఈప్రభుత్వం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుకూడా ఇటువంటి ఘటనలు జరగలేదని, టీడీపీప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా ఒక్కమసీదుపైగానీ, చర్చిపైగానీ, దేవాలయంపై గానీ దా-డిజరిగింది లేదన్నారు. ఈనాడు ప్రభుత్వఅసమర్థత వల్లే, మతమార్పుడులుచేసేవారు రాష్ట్రంలోరెచ్చిపోతున్నారని, ప్రభుత్వ కనుసన్నల్లో జరగుతున్న బలవంతపు మత మార్పిడులకు టీడీపీ అడ్డుగాఉందన్న దురాలోచనతో, కావాలనే ప్రతిపక్షంపై పాలకులు ఎదురుదా-డి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా అన్నిమత విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత జగన్ పై లేదా అని ప్రశ్నించిన ఉమా, వ్యవస్థలన్నింటినీ చేతుల్లో ఉంచు కున్న ప్రభుత్వం టీడీపీపై నిందలేయడం ఏమిటన్నారు? టీడీపీ వారు ఎక్కడైనా అటువంటి చర్యలకు పాల్పడిఉంటే, ప్రభుత్వం పోలీసులు సాక్ష్యాధారాలతో సహా ఎందుకు బయటపెట్టడం లేదన్నా రు. రాష్ట్రంలో 32వేల దేవాలయాల్లో సీసీ.కెమెరాలు పెట్టించామని డీజీపీ చెప్పారని, మరి అలాంటప్పుడు వాటిలో రికార్డైన దృశ్యాల ను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. ప్రవీణ్ చక్రవర్తి వంటి పాస్టర్లు బహిరంగంగా తాము దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసంచేశామని చెప్పుకుంటుంటే అతనిపై ఏం చర్యలు తీసుకు న్నారని బొండా నిలదీశారు. అసలు దోషులను పట్టుకోకుండా, ప్రభుత్వం తిరిగి రాజకీయ అంశాలకే ప్రాధాన్యతనిస్తూ, టీడీపీకి అంటగట్టాలని చూస్తోందన్నారు.
తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను దేవాలయాలపై దాడులకు లింకుపెడుతూ, వైసీపీప్రభు త్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరని ఉమా తేల్చిచెప్పా రు. దేవాలయాలపై దా-డిఘటనలో ఏంచర్యలు తీసుకున్నారో, దోషుల్లోఎందరిని అరెస్ట్ చేశారో చెప్పకుండా ప్రతిపక్షాన్ని బూచిగా చూపడం సిగ్గుచేటన్నారు. దేవాలయాలపై దా-డులన్నీ వైసీపీ ప్రభుత్వ మద్ధతుతోనే జరుగుతున్నాయని టీడీపీ ఆధారాలతో సహా నిరూపించిందని, రామతీర్థంలో వైసీపీప్రభుత్వ మద్ధతుతోనే రాములవారి శిరస్సు ఖండింపబడిందన్నారు. చంద్రబాబునాయు డు రామతీర్థం వెళ్లేవరకూ, జగన్ ఆ ఉదంతంపై ఎందుకు మాట్లాడ లేదన్నారు? 161 ఘటనలు జరిగితే, ప్రవీణ్ చక్రవర్తి వంటివారు తామేచేశామని చెబుతుంటే, ప్రభుత్వం ఎందుకు ఘటనలకు కారకులైనవారిని అరెస్ట్ చేయలేక పోయిందన్నారు? ప్రవీణ్ చక్రవర్తిఎవరు, అతనికి బ్రదర్ అనిల్ కుమార్ కు ఉన్నసంబంధాలేమిటి? సదరు పాస్టర్ కు కడపలో బ్యాంక్ ఎకౌంట్ ఎందుకుంది? ఆ అకౌంట్ కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిమద్థతుతో ప్రవీణ్ చక్రవర్తి దేవాలయాలపై దాడులుచేశాడు అనేఅంశాలపై ప్రభుత్వం ఎందుకు లోతైన విచారణ జరపడంలేదన్నారు? ప్రభుత్వ మద్ధతు లేకుండా 161 ఘటనలు జరిగాయంటే ఎవరూ నమ్మేస్థితిలో లేరన్న బొండా ప్రవీణ్ చక్రవర్తి వంటివారు తాముచేసిన దురాగతాలను బహరంగం గా చెబుతున్నా అతన్నిపాలకులు ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నా రు.
హిందూమతపరిరక్షకులు, స్వామీజీలు జగన్ మద్ధతుతోనే రాష్ట్రంలో హిందూమతంపై దా-డులుజరుగుతున్నాయని బహిరంగం గానే చెబుతున్నారన్నారు.అంబేద్కర్, రంగా విగ్రహాల ధ్వంసంతో ప్రశాంతమైన గ్రామాల్లో చిచ్చుపెట్టడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్లు తేలిపోయిందన్నారు. కాపులు, ఎస్సీలకు మధ్యచిచ్చుపెట్టేలాచేసి, బీసీలు, ఇతరవర్గాలకు మధ్య కలహాలు రాజేసేలా ప్రభుత్వం తనకుటిలరాజకీయాలను అమలు చేయబోతోందని, సజ్జల మాటలతోనే తేలిపోయిందన్నారు. రాము డితలను ఖండించినవారు, రంగా, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడానికి వెనుకాడరనే వాస్తవాన్ని గ్రహించి, ప్రతిఒక్కరూ వారి వారిప్రాంతాల్లోని విగ్రహాలను వారే కాపాడుకోవాలని బొండా పిలుపునిచ్చారు. అంబేద్కర్, రంగా విగ్రహాలపై దాడిజరిగితే, ప్రభుత్వం అంతుచూసేదాకా తగ్గబోమని ఉమా ఈసందర్భంగా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో ప్రభుత్వం, ప్రతిపక్షాలపై నిందలేయడం మానుకోవాలన్నారు.