సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరైనా బలవంతులు, బలహీనుల మీద స్కెచ్ వేస్తే, ఆ బలహీనులు కొన్నాళ్ళు తప్పించుకుని తిరిగే పరిస్థితి. ఇక్కడ బలవంతుడు అంటే, అధికారం ఉన్న వాళ్ళు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు, ఈ బలహీనులు, ప్రాణాలను కాపడుకోవాల్సిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజకీయ దాడులు పెరిగిపోయాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గ్రామాల్లో కారాడుతున్నారు. ఇప్పటి వరకు 300 పైగా రాజకీయ దాడులు జరిగాయి. 7 గురు కార్యకర్తలు చనిపోయారు. గ్రామాల్లో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టె పరిస్థితి. ఈ దాడులకు భయపడి, వైసిపీ నేతల అరాచకం తట్టుకోలేక గ్రామాల్లో నుంచి తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళిపోయి, ఎక్కడో తలదాచుకునే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా, పట్టించుకునే వారే లేరు.
అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఏ పార్టీ చెయ్యని కార్యక్రమం, కార్యకర్తల కోసం చేస్తుంది. వైసీపీ దాడులతో గ్రామాల్లో ఉండలేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకు పార్టీ తరుపున పునరావాసం కల్పించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం గుంటూరులో ఈ పునరావాస శిబిరం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన నిన్న గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పల్నాడులో కొన్ని గ్రామాల్లో, తెలుగుదేశం కార్యకర్తలు, సానుభితి పార్టులు, వైసీపీ నేతల దాడులు భరించలేక ఊళ్ళు కాళీ చేసి, వేరే చోట తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది.
అయినా వారి భద్రతకు గ్యారంటీ లేదు. అందుకే పార్టీ తరుపునే ఈ బాధ్యత తీసుకున్నారు. ఇలనాటి వారిని దృష్టిలో ఉంచుకుని, గుంటూరులో పునరావాస శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. పల్నాడు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే వారందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ బాధితులు ఇక్కడే ఉండే అవకాశం కల్పిస్తామని, తర్వాత తనే దగ్గర ఉండి బాధితులను ఆయా గ్రామాలకు తీసుకెళ్లానని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులు చక్కదిద్దుకోకపొతే, ఆయనే స్వయంగా ఆ గ్రామల్లో నివసిస్తానని, ఇప్పటికే చెప్పారు. మరి ఈ శిబిరానికి ప్రభుత్వం తరుపున ఏమైనా అడ్డు చెప్తారో, లేదో చూడాలి.