ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తే, ప్రత్యర్ధులను వేతాడుతున్నారు. తమ మాట వినకపోతే, జేసిబినో, పీసిబినో, లేక పోలీసులో వచ్చి వాలిపోతారు. అయితే ఈ పరిస్థితిలో కూడా కొంత మంది రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పుడే గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసిపి పరిస్థితి దారుణంగా ఉంటుంది అనేది అర్ధం అవుతుంది. దీంతో ఇప్పటి నుంచి ప్రతిపక్ష టిడిపిలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. ఇది టిడిపికి మాంచి జోష్ ఇచ్చే వార్త అనే చెప్పాలి. జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఈ నెల 20వ తేదీన చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి వస్తున్నట్టు తెలిపారు. ఆయనతో పాటుగా ఆయన కుమారుడు కూడా టిడిపి తీర్ధం పుచ్చుకోనున్నారు. జమ్మలమడుగులు టిడిపికి పూర్వ వైభవం తెస్తామని చెప్తున్నారు. ఇక కడపలోని రాయచోటికి చెందిన బలమైన వైసిపీ నేత కూడా ఒకరు టిడిపిలోకి రాబోతున్నారు. అదే జిల్లాకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి కూడా, తాను అభివృద్ధిని కాంక్షించే పార్టీలోకి వస్తున్నా అని చెప్పకనే చెప్పారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మీడియాలో బలమైన గొంతుగా ఉన్న జి.వెంకట రెడ్డి కూడా ఇటీవల చంద్రబాబుని కలిసారని, ఆయన కూడా టిడిపిలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద, టిడిపి ఇంకా రాజకీయంగా ఆక్టివ్ అవ్వక ముందే, టిడిపిలోకి వలసలు రావటం గమనించాల్సిన అంశం.
టిడిపికి మంచి జోష్ ఇచ్చే వార్త...
Advertisements