టిడిపి రాజకీయాలు వ్యూహాలు మిగతా పార్టీలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య రీతికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోపణలు-విమర్శలకు సభ్యతగా స్పందించడం ఒక ఆనవాయితీగా చాలా కాలం కొనసాగించింది టిడిపి. ప్రత్యర్థులు బూతులు, దాడులకు దిగుతున్నా అదే తీరు. టిడిపి అధికారంలో వున్నప్పుడు అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసి గుండెపోటు అని ముందు ప్రచారం చేశారు. ఆ తరువాత చంద్రబాబే చంపించారని, నారాసుర రక్తచరిత్ర అని అచ్చేయించారు. దీనిపై నాటి సీఎం చంద్రబాబు చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో మౌనంగా ఉన్నారు. దీంతో ఎన్నికల్లో లబ్ధి పొందిన వైసీపీ అధికారం చేపట్టింది. తన మెతక వైఖరి, టిడిపి ప్రజాస్వామ్య ధోరణి, నిర్ణయాలు తీసుకోవడంలో నాన్చడం వంటివి ఎంత నష్టమో టిడిపికి అర్థమైంది. వైసీపీ దాడులతో టిడిపి గుణపాఠం నేర్చింది. తెలుగుదేశం కూడా తమ తీరు మార్చుకుంది. నేతలు జోరు పెంచారు. వైఎస్ వివేకానందరెడ్డి హ-త్యకేసుని విచారిస్తున్న సీబీఐ చూపు అంతా జగన్ రెడ్డి ఇంటి మనుషుల చుట్టూ తిరగడంతో నారాసుర రక్తచరిత్రకి కౌంటర్ ఇప్పుడు ఇచ్చింది. వివేకా హత్యపై ‘జగనాసుర రక్త చరిత్ర’ పేరిట పుస్తకం విడుదల చేసింది. వివేకా హత్యలో వేళ్లన్నీ జగన్, భారతి కుటుంబంవైపే చూపిస్తున్నాయని పుస్తకంలో ఆధారాలతో సహా పొందుపరిచారు. వివేకా హత్య కేసులో కీలక వైసీపీ నేతల పనేనని, 2019ఎన్నికల్లో వివేకా హత్యపై జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ది పొందారని ఎన్నికల కమిషన్‌కి వివరించి వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతామని ఏపీ టీడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పరిణామలు చూస్తోన్న టిడిపి కేడర్ ఇన్నాళ్లకు టిట్ ఫర్ టాట్ తెలుగుదేశం మొదలు పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం తీరు మారింది..నేతల జోరు పెరిగింది
Advertisements