నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి, గుంటూరు జిల్లా పొనుగుపాడులో, వైసీపీ నేతలు చేసిన విధ్వంసం పై మాట్లాడారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసారని, వారి రోడ్డుకి అడ్డంగా గోడ కట్టిన వ్యవహారం పై సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ కూడా విధించారు. ఈ అంశం పై, సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. అయితే అంతకంటే ముందే, క్షేత్ర స్థాయిలో వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవటానికి, తెలుగుదేశం సీనియర్ నేతలను చంద్రబాబు అక్కడకు పంపించారు. జరిగిన సంఘటన పై నిజనిర్ధారణ చేసి, రావాలని, పార్టీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్ రెడ్డి, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్ తదిరులను చంద్రబాబు ఈ రోజు అక్కడకు పంపించారు.
ఈ నేతలు ఈ రోజు అక్కడకు బయలుదేరి వెళ్లారు. అసలు అక్కడ ఏమి జరిగింది, వైసీపీ చేసిన అరాచకం ఏంటి, ఇవన్నీ ప్రజలకు కళ్ళారా చూపించాలని, మీడియాను కూడా వెంట పెట్టుకుని అక్కడకు వెళ్లారు. అయితే, పోలీసులు మాత్రం, వీరిని అక్కడ దాకా కూడా వెళ్ళనివ్వలేదు. వారిని, నరసారావుపేట దగ్గరే అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు అక్కడకు వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని, అందుకే తెలుగుదేశం నేతలను అక్కడకు వెళ్ళనివ్వం అంటూ పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసారు. అంతే కాదు, తెలుగుదేశం నేతలు అక్కడకు వచ్చి, అక్కడ జరిగిన అనాగరిక చర్య ప్రపంచానికి తెలిసేలా చేస్తారని గ్రహించి, అక్కడ ముందుగానే 144 సెక్షన్ పెట్టారు.
అయితే తెలుగుదేశం నేతలు మాత్రం, మేము అక్కడకు గొడవ చెయ్యటానికి వెళ్ళటం లేదని, అసలు ఏమి జరిగిందో చూసి, తెలుగుదేశం సానుభూతి పరులను పరామర్శించి, అక్కడ జరిగిన విషయాన్ని మీడియాకు చూపిస్తామని అన్నారు. అక్కడ ఎలాంటి ఆందోళనలు చెయ్యమని చెప్పనా, మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, మిమ్మల్ని అక్కడకు పంపించే ప్రసక్తే లేదు అంటూ, పోలీసులు వెళ్ళడించారు. అయితే వీరిని అరెస్ట్ చేసారని తెలియటంతో, పొనుగుపాడులో తెలుగుదేశం శ్రేణులు అందోళన చేపట్టాయి. అయితే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఎన్నికల తరువాత, పొనుగుపాడులో, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసరనే నెపంతో, వైసీపీ వర్గీయులు రోడ్డు అడ్డంగా గోడకట్టారు. గోడకు అవతల వైపు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇళ్ళు ఉండటంతో, వారికి ఇబ్బందిగా మారింది. దీని పై స్పందించిన చంద్రబాబు, ఈ రోజు అక్కడకు పార్టీ నేతలను పంపించారు.