టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసారు. ఉప్పు నిప్పుగా ఉండే కేసీఆర్ కు టిడిపి ఎమ్మెల్యేలు లేఖలు రాయటం పై అందరూ ఆశ్చర్య పోయినా, ఇదేమి సొంత విషయమో,లేక రాజకీయం కోసమో కాదు. తమ ప్రాంత రైతాంగం కోసం వారు కేసీఆర్ కు లేఖ రాసారు. వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయటం పై, ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి, కేసీఆర్ కు లేఖ రాసారు. వెలుగొండ ప్రాజెక్ట్ కు అనుమతి లేదు అంటూ, ఆ ప్రాజెక్ట్ అక్రమం అంటూ, తెలంగాణా ప్రభుత్వం ఆగష్టు 23న కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకి ఒక లేఖ రాసింది. దీని పై టిడిపి ఎమ్మెల్యేలు అభ్యంతరం హ్సుప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్ కు అనుమతి లేదని, మీకు ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నించారు. కేంద్ర గెజిట్ లో వెలుగొండ ప్రాజెక్ట్ చేర్చక పోవటం, మా ప్రభుత్వం అసమర్ధత తప్ప, దానికి అనుమతులు లేక కాదని లేఖలో తెలిపారు. 2014 పునర్విభజన చట్టంలోనే వెలుగొండ ప్రాజెక్ట్, సహా తెలంగాణా రాష్ట్రంలో ఉన్న నెట్టంపాడు, కల్వకుర్తి ఉన్న ఉన విషయాన్నీ గుర్తు చేసారు. ఇప్పటికే ఈ విషయం పై తమ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తూ లేఖ రాసి, కేంద్రం పై ఒత్తిడి తేవాలని కోరినట్టు వారు కేసీఆర్ కు రాసిన లేఖలో తెలిపారు.
ఇప్పుడు కేంద్రం ఇచ్చిన గెజిట్ లో మీ నెట్టంపాడు, కల్వకుర్తిని చేర్చిందని, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ను చేర్చ లేదని తెలిపారు. అది తమ తప్పు కాదని, తమ జిల్లా రైతాంగం తప్పు కదాని, కరువు జిల్లాగా ఉన్న మా రైతులు తప్పు కాదని అన్నారు. ఇది కచ్చితంగా తమ ప్రభుత్వం తప్పు, తమ ముఖ్యమంత్రి అసమర్ధత అంటూ లేఖలో తెలిపారు. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి అసమర్ధతతో చేసే తప్పులు సాకుగా చూపించి, మీ ప్రభుత్వం, తమ జిల్లాకు మంచి చేసే వెలుగొండ ప్రాజెక్ట్ పై, కేంద్రానికి ఫిర్యాదు చేయటం, మీ హోదాకు తగదు అంటూ లేఖలో తెలిపారు. తమ జిల్లాకు నష్టం చేకూరే నిర్ణయాలు తీసుకోవద్దని, మా ప్రకాశం జిల్లా ప్రజానీకం తరుపున మిమ్మల్ని కోరుతున్నామని అన్నారు. తమ జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా అని, వలసులు ఎక్కువ ఉన్నాయని, వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే అందరికీ మంచి జరుగుతుందని లేఖలో తెలిపారు. తమ ప్రాజెక్ట్ అయిన వెలుగొండకు అన్ని అనుమతులు ఉన్నాయని, చట్టబద్దత కూడా ఉందని, తమ ప్రభుత్వ అసమర్ధత సాకుగా చూపి, అన్యాయం చేయవద్దు అని కోరారు.