నిన్న చంద్రబాబు చెప్పిన విధంగానే, దేశ రాజధానిలో, మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, తెలుగుదేశం ఎంపీలు, ఇక్కడ ప్రజల ఆక్రోశాన్ని, దేశం మొత్తం తెలిసేలా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు... పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ దిశగా కార్యాచరణ చేపట్టారు. ముందుగా, మన ఎంపీలు పార్లమెంట్ ప్రారంభానికి ముందు, అక్కడ ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియ చేసారు... అలాగే, విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చారు. 193వ నిబంధన కింద టీడీపీ ఎంపీలు నోటీస్‌ ఇచ్చారు.

parliament 05022018 2

విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఎంపీలు తోట నరసింహం, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప నోటీసు ఇచ్చారు. విభజన హామీల అమలుపై 193వ నిబంధన కింద చర్చ చేపట్టాలని నోటీసులో పేర్కొన్నారు. దీని ప్రకారం, కేంద్రం అన్నిటి పై సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది... ఇది అన్నీ రికార్డులలో ఉంటుంది కాబట్టి, కేంద్రం చెప్పిన సమాధానం పై, అవసరమైతే, కోర్ట్ కి కూడా వెళ్ళవచ్చు అనేది రాష్ట్రం ఆలోచన... అయితే ఒక బీజేపీ ఎంపీ చనిపోవటంతో, ఇవాళ సభ వాయిదా పడే అవకాసం ఉంది...

parliament 05022018 3

రాజ్యసభలో యధావిధగా ఆందోళన జరిగే అవకాసం ఉంది.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ గత కొద్దిరోజులుగా టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ విచ్చారు. నిన్న జరిగిన సమావేశంలో, మిత్ర ధర్మాన్ని పక్కాన పెట్టి, బహిరంగంగా బీజేపీ ఎండగట్టాలని నిర్ణయించారు... తెలుగుదేశం ఎంపీల ఆందోళనకు, అకాళీదళ్‌ పార్టీ, శివసేన పార్టీ మద్దతు ప్రకటించాయి... కాని, మన సొంత వైసిపీ ఎంపీలు మాత్రం, మాద్దతు లేదు, ఆందోళన లేదు.. ఎక్కడ ఉన్నారో తెలీదు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read