లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు... ఉదయం 11 గంటల నుంచి నిరాటంకంగా ఆంధ్రా ప్రజల ఆక్రోశం దేశానికి వినిపిస్తున్నారు... ప్రధాని మోడీ ఉదయం నుంచి సభలో లేరు... ప్రధాని మోడీ సభలోకి వచ్చిన తరువాత కూడా, టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు... మోడీని చూసి మరింత బిగ్గరగా నినాదాలు చేసారు... మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మిత్ర ధర్మం పాటించండి... మిత్రులకి న్యాయం చెయ్యండి... దగా పడ్డ మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అంటూ, ఆందోళన చేసారు... ఈ సమయంలో మోడీ కొంచెం ఇబ్బందిగా కనిపించారు...
అయినా సరే మన ఎంపీలు నినాదాలు ఆపలేదు.. దీంతో, సభ వాయిదా పడింది... అయితే, వైసిపీ ఎంపీలు మాత్రం, కనిపించకుండా పోయారు... ఉదయం ప్లకార్డులు పట్టుకుని కొంచెం సేపు వెల్ లో హడావిడి చేసినా, మోడీ వచ్చిన తరువాత కనిపించలేదు... మొత్తానికి, మోడీ ముందే, ధైర్యంగా మన ప్రజల ఆక్రోశాన్ని, మిత్ర పక్షంగా ఉంటూనే వినిపించారు.... పార్లమెంట్ లోనే కాదు, రాజ్యసభలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది... దీంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది...
ఇది ఇలా ఉండగానే, తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చర్చలకు పిలిచారు. అయితే... ఈ చర్చలకు వెళ్లేందుకు టీడీపీ ఎంపీలు విముఖత వ్యక్తం చేశారు. విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ రెండు రోజులుగా టీడీపీ ఎంపీలు అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభలో ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో ఉభయ సభల నిర్వహణకు కొంత ఆటంకం కలుగుతోంది. దీంతో చొరవ తీసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ టీడీపీ ఎంపీలను చర్చలకు పిలిచారు. కాగా... విభజన హామీలపై స్పష్టత వస్తే తప్ప తాము చర్చలకు వచ్చేది లేదంటూ చర్చలకు టీడీపీ ఎంపీలు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.