ప్రాధాని మోడీకి తెలుగుదేశం పార్టీ చుక్కలు చూపిస్తుంది.... నెల రోజుల నుంచి, చంద్రబాబు, మోడీని ఏకి ఏకి పెడుతుంటే, పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేసారు.. ఎంత చేసినా, పార్లమెంట్ లో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు... పార్లమెంట్ వాయిదా పడినా, తెలుగుదేశం ఎంపీలను ఢిల్లీలోనే ఉండమని చంద్రబాబు ఆదేశించారు... అయితే, ఎందుకు ఉండమన్నారా అని అందరూ అనుకున్నారు... చివరి వరకు, ఏ రకమైన ఆందోళన చేస్తున్నారో ఎవరికీ చెప్పలేదు... ఆదివారం ఉదయం ఉన్నట్టు ఉండి, తెలుగుదేశం ఎంపీలు అందరూ, మోడీ ఇంటికి బయలు దేరి వెళ్లి, మోడీ ఇంటి ముందు, టిడిపి ఎంపీల మెరుపు ధర్నా నిర్వహించారు...
అయితే వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు... ఢిల్లీ పోలీసు కమీషనర్ తో సహా అందరూ వచ్చేశారు.. ఎంపీలను ఈడ్చి అవతల పడేసారు.. బలవంతంగా వారిని తరలించే క్రమంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు లాగి పడేశారు.. ఎంపీలు వినక పోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు. అరెస్టులతో తమను ఆపలేరని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా సీఎం రమేష్ హెచ్చరించారు.
ప్లకార్డులు చేతబూని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ డిమాండ్ చేశారు. విభజన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని కోరారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే బలవంతంగా తరలించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఎంపీలు అన్నారు. ఈ చర్యతో మోదీ నిరంకుశతత్వం బయటపడిందన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో రోజుల తరబడి గొంతు చించుకున్నా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం ప్రధాని మాత్రమే చేయగలరని.. అది జరిగేవరకూ తమ పోరాటం ఇలాగే సాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు.