పేటీయం బ్యాచ్ తో పాటు, పైడ్ జర్నలిస్ట్ లను వాయించి పడేసారు టిడిపి ఎంపీలు. పేటీయం డబ్బుల కోసం ఆశ పడి, ఫేక్ చేస్తూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువనే చెప్పుకోవాలి ఈ కోవలోనే మేము జరనలిస్ట్ లం అని చెప్పుకునే ఏర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. ఈ పేటీయం ఏర్నలిస్ట్ లకు, ఫేక్ చేస్తేనే కదా కాసులు వచ్చి పడేది. అందుకే ప్రతి క్షణం టిడిపి పైన ఫేక్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో డీఎంకే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో 20కు పైగా రాజకీయ పార్టీలు పాల్గున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీ వ్యవస్థ కోరుకునే టిడిపి కూడా, ఈ కార్యక్రమానికి హాజరు అయ్యింది. ఇంకేముంది, ఫేక్ బ్యాచ్ రెడీ అయిపొయింది. టిడిపి పైన ఫేక్ చేస్తే చాలు, మాకు డబ్బులు వస్తాయి అని భావించి, ఫేక్ స్టొరీ అల్లేసారు. సోనియా గాంధీతో టిడిపి ఎంపీలు ఉన్న ఫోటో చూపించి, మళ్ళీ టిడిపి కాంగ్రెస్ కలిసిపోతున్నాయి అంటూ ఫేక్ చేసి పడేసారు. అక్కడ డీఏంకే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అని కాకుండా, సోనియా మీటింగ్ పెడితే టిడిపి వెళ్ళింది అంటూ ప్రచారం చేసారు. దీంతో ఈ ఫేక్ ప్రచారం పై, టిడిపి, ఆ 4పైడ్ ఏర్నలిస్ట్ లకు, పేటీయం బ్యాచ్ కి కౌంటర్ ఇచ్చింది.

tdp 05042022 2

టిడిపి ఎంపీలు గల్లా, రామ్మోహన్, కేశినేని నాని ఒక ప్రకటన విడుదల చేసారు. తాము తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం మేరకు, ఢిల్లీలో డీఏంకే కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి వెళ్లామని అన్నారు. ఈ కార్యక్రమానికి, టిడిపి ఎంపీలతో పాటుగా, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఈ వేడుకకు హాజరు అయ్యరని అన్నారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, శుభకార్యం అని, మనలని ఒకరు పిలిస్తే ఎలా ఒక వేడుకకు వెళ్తామో, అలాగే వెళ్ళమని అన్నారు. తమతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కూడా వచ్చారని, అయితే అక్కడ ఫోటోలను తీసి, కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజకీయాల కోసం శుభకార్యానికి రాజకీయాలు అంటగట్టడం దారుణం అని అన్నారు. తాము ఏమి చేసినా స్వచ్చమైన రాజకీయలు చేస్తాం కానీ, చాటు మాటు రాజకీయలు చేయం అని అన్నారు. తప్పుడు రాజకీయాలు మానుకుని, ఉండాలని, టిడిపి పార్టీ ఎంపీలు తమ ప్రెస్ నోట్ లో తెలిపారు. ఇప్పటికైనా ఈ పైడ్ బ్యాచ్, ఇలాంటి విష ప్రచారం, ఫేక్ ప్రచారం కాకుండా, వాస్తవాలు రాస్తుందని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read