సజ్జల రామకృష్ణారెడ్డి నేడు చిలుకపలుకులు బాగా పలికారని, ప్రజాసంబంధ వ్యవహారాల్లో సలహాదారుగా ఉండాల్సిన వ్యక్తి, నిత్యం ప్రెస్ మీట్లుపెట్టి చంద్రబాబుని తిట్టడం, అమరావతిపై విషంచిమ్మడమే పనిగా పెట్టుకు న్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళి పాళ్ల నరేంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. " ప్రభుత్వంలో ఉన్నవాళ్లంతా సంస్థాగతంగా ఉన్న ఏజెన్సీ లను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజాసంబం ధ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని తనకన్నుసన్నల్లోనే పెట్టుకొని, వెనకుండి నడిపిస్తున్నాడని రాష్ట్రమంతా సజ్జలగురించి చెప్పుకుం టోంది. తెలుగుదేశం ప్రభుత్వం అసైన్డ్ భూములకు సం బంధించి దోపిడీకి పాల్పడిందని ఆయన చెబుతున్నా డు. అ సైన్డ్ భూములున్న దళితులకు ప్లాట్ల విస్తీర్ణం పెంచి ఇ వ్వాలనుకోవడం గతప్రభుత్వంచేసిన తప్పా అని నేను ప్రశ్నిస్తున్నా. అది దళితులకు ద్రోహం చేయడం ఎలా అవుతుందో రామకృష్ణారెడ్డి చెప్పాలి. ఎవరిని మభ్యపెట్ట డానికి సజ్జలఅసత్యాలు చెబుతున్నారు? ఆనాటిప్రభు త్వం జీవోలన్నీ ఇచ్చిన ఆరుసంవత్సరాల తర్వాత, ఇప్పుడు దళితులకు అన్యాయంజరిగిందంటూ జగన్నా టకానికి ఈ ప్రభుత్వం ఎందుకు తెరతీసింది? దేనికోసం ప్రభుత్వం దళితులముసుగేసుకొని కపటనాటకాలకు తెరలేపిందో లేదో సజ్జల చెప్పాలి. విశాఖ పట్నం ప్రాంతంలో 2,552ఎకరాల దళితుల స్వాధీనం లోని అసైన్డ్ భూములను, పీవోటీ యాక్ట్ కింద ఉన్న 465ఎకరాలు, అంక్రోచ్ మెంట్ ల్యాండ్స్ 2343ఎకరాలు, వేకెంట్ ల్యాండ్ 600ఎకరాలు మొత్తం కలిపి దాదాపు 6,200ఎకరాలు సేకరించారు. పేదల ఇళపట్టాలపేరుతో ఆ భూములను సేకరించిన ప్రభు త్వం, వాటిని ఎవరికి అప్పగించిందో సజ్జల చెప్పాలి. సజ్జల చెబుతున్న స్కామ్ మొత్తం అమరావితిలో లేదు. అంతా విశాఖపట్నంలోనే ఉంది. విశాఖపట్నం రాజధాని అనిచెప్పి, ప్రభుత్వం ఏ విధంగా దోపిడీకి పాల్పడిందో అందరికీ తెలుసు. రాష్ట్రంలోకనపడినదానినల్లా మింగేసే అనకొండలు తయారయ్యాయి. ఆ అనకొండలు గాలి, నీరు, ఇసుక, కొండలు, ఖనిజాలు, దేన్నీవదలడంలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగువారు దేశవిదేశాలతో పాటు, ఎక్కడెక్కడో పెద్దపెద్దకంపెనీలు స్థాపించి, పారిశ్రామికరం గంలో ఆదర్శంగా నిలిచారు. అటువంటి వ్యక్తులు నేడు తమతమ పరిశ్రమలను, కంపెనీలను తెగనమ్ముకుంటు న్నారు.

ఇక్కడున్న ప్రభుత్వపెద్దలు, కొందరికి దాసోహ మవ్వడం మూలానా, తెలుగువారు తమపరిశ్రమలను, కంపెనీలను అమ్ముకుంటున్నారు. అటువంటి పరిస్థితి కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. ప్రభుత్వపెద్దల నిర్వాకంవల్ల, వేలకోట్లనజరానాలకు వారంతా అమ్ము డు పోవడమే అందుకు కారణం. బ్లూమీడియా లేనివి ఉన్నట్లు, ఉన్నవిలేనట్టు చెబుతూ, గాలిపోగేసి దుష్ప్ర చారంచేస్తోంది. విషప్రచారానికి బ్లూమీడియా వేదికగా మారింది. దాన్నిఅడ్డుపెట్టుకొని వైసీపీనేతలు, ప్రభుత్వం బురదజల్లుడు కార్యక్రమాలు చేస్తున్నారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని, ఆపదం ఇక్కడ ఉత్పన్నం కాదని హైకోర్ట్ చాలాస్పష్టంగా చెప్పింది. అయినాకూడా పనిగట్టుకొని అదేపనిగా విషప్రచారంచేస్తున్నారు. ప్రజలను ఎన్నాళ్లు ఈ విధంగా మభ్యపెడతారో చూస్తాం. మమ్మల్ని మభ్యపెట్టి సంతకాలు పెట్టించుకున్నారని, తమను ఎవరూమోసంచేయలేదని ప్రభుత్వం పెట్టిన తప్పుడుకేసులోని వ్యక్తులే చెప్పారు. తెలుగుదేశం పాత్ర గానీ, చంద్రబాబునాయుడి ప్రమేయం కానీ లేదని విస్ప ష్టంగాచెప్పాకకూడా కొందరు మాట్లాడుతున్నారంటే, వారు అస్సలు మనుషులేనా అని అనిపిస్తోంది. వారు తీవ్రమైన నిరాశానిస్పృహలో ఉన్నారనిపిస్తోంది. అధికా రంలోకి రాకముందు వేలకోట్ల దోపిడీజరిగిందని, వేలాది ఎకరాలు దోచుకున్నారని చెప్పినవారే, అధికారంలోకి వచ్చాక, చీకట్లు తొలగిపోవడంతో, వాస్తవాలన్నీ ఒక్కొ క్కటిగా బయటకు వస్తుండంతో వారంతా అసహనంతో మాట్లాడుతున్నారు. ఆళ్లరామకృష్ణారెడ్డి తప్పుడుఫిర్యా దులో పేర్కొన్న వ్యక్తులు వారివేదన, బాధను వారి బంధువులతో చెప్పుకున్నట్లున్నారు.

జీవోనెం-25, 72లతో దళితులనుంచి భూములు లాక్కొని వారిని రోడ్లపై పడేసినవారు మహాత్ములా? జరీబుభూములతో సమానంగా అసైన్డ్ భూ ములకు కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ ల్యాండ్ ఇచ్చిన చంద్రబాబునాయుడు దళితద్రోహా? చర్చకు రమ్మంటే టీడీపీనుంచి ఎవరైనావస్తారా? దానికి చంద్ర బాబునాయుడితో పనిలేదు. బ్లూమీడియాతో నిరంతరం ప్రజలను మోసంచేయాలనేఆలోచనలు ఉంటే, వారే తగిన విధంగా బుద్ధిచెబుతారు. నిజంగా వైసీపీ ప్రభు త్వానికి చిత్తశుద్ధి ఉంటే, దళితులపై నిజమైన ప్రేమాభి మానాలుంటే, విశాఖపట్నంకేంద్రంగా జరిగిన భూముల క్రయవిక్రయాలు, సేకరణపై విచారణకు ఆదేశించే ధైర్యం సత్తాఉన్నాయా? భూసేకరణ పేరుతో దళితులనుంచి ఇతరత్రా మార్గాలద్వారా సేకరించిన భూముల వ్యవహా రంపై సిట్టింగ్ హైకోర్ట్ న్యాయమూర్తితో విచారణజరిపించే ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా? మూడురాజధానులు అనిచెప్పింది విశాఖపట్నంలోని భూములను కొట్టేయ డానికే. విజయసాయిరెడ్డి తనఅనుచరులు, అనుమా యులతో అక్కడపాగావేసి, భూములులాక్కున్నాక, వాటికి ధరలుపెంచడానికే ప్రభుత్వం మూడురాజధాను ల ప్రకటనచేసింది. చంద్రబాబునాయుడు స్టే ఎందుకు తెచ్చుకున్నాడనే వారంతా, జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతికేసులు విచారణకుఎందుకు రావడంలేదో, ఆయన కోర్టులకుహాజరుకాకుండా ఎందుకు తప్పించు కుంటున్నాడో సమాధానంచెప్పాలి. ముఖ్యమంత్రి పునీ తుడు, అగ్నినుంచి పుట్టనవాడైతే, కోర్టుకు హాజరు కాకుండా డిశ్చార్జి పిటిషన్లు ఎందుకు వేస్తున్నాడో వైసీపీ నేతలు, కార్యకర్తలు సమాధానంచెప్పాలి.

ఏతప్పూ చే యనప్పుడు ముఖ్యమంత్రి డిశ్చార్జిపిటిషన్లువేసి, కేసు లను ఎందుకు వాయిదా వేయించుకుంటున్నాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులోచెప్పినవారంతా నిజమైన బాధితులుకారు. వారంతా తెలుగుదేశానికి, చంద్రబాబు కి సంబంధంలేదని చెప్పారు. సీఐడీ విభాగం రాజధాని గ్రామాల్లోతిరుగుతోంది. వారితో రాజధానిలేకుండాచేస్తే తమ భవిష్యత్ఏంటని రైతులంతా గగ్గోలుపెడుతున్నా రు. వైసీపీనేతలు, మంత్రులు, ప్రభుత్వపెద్దలు మొసలి కన్నీరు కార్చడం మానేసి, ఈప్రభుత్వంలో దళితుల నుంచి లాక్కున్నఅసైన్డ్ భూములపై న్యాయవిచారణకు సిద్ధమో కాదో చెప్పాలి. సీఐడీ అధికారులుకూడా పైనుం చి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక, వారికివారే ఏదేదో రాసుకొ ని సంతకాలు పెట్టించుకుంటున్నారు. సీఐడీ కేసులన్నీ కూడా ప్రభుత్వకుట్రలో భాగమేననడంలో సందేహం లేదు. వేలకోట్ల విలువైన 30నుంచి 40లక్షల చదరపు గజాల భూమిని కొట్టేయడానికే వైసీపీప్రభుత్వం విశాఖ పట్నాన్ని రాజధానిగా ప్రకటించింది. ఆభూమిని తన అనుమాయులకు, కోటరీకి కట్టబెట్టి వారినుంచి వేలకో ట్లు కొట్టేయడానికే ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడింది. నిజంగా ప్రభుత్వానికి దళితులపై ప్రేమే ఉంటే, ఆ భూ మిని వారికే ఇవ్వవచ్చుకదా? అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు, ప్రభుత్వానికి ఎంతుందో, ప్రతిపక్షానికి కూడా అంతేఉంది. ప్రభుత్వదోపిడీని నిలువరించాల్సినబాధ్యత ప్రజలతరుపు పోరాటంచేస్తున్న ప్రతిపక్షంపై ఉంది. విశా ఖపట్నంలో ప్రభుత్వం కాజేయాలనుకుంటున్నభూమి గజం రూ.5వేలచొప్పున వేసుకున్నా రూ.15వేలకోట్ల వరకు ఉంటుంది. అంతవిలువైన భూమిని దళితులకు ఇవ్వడానికి ఈప్రభుత్వానికి ఎందుకు మనసురావడం లేదు?

Advertisements

Advertisements

Latest Articles

Most Read