గతంలో జరిగిన పంచాయితీ, జడ్పీ ఎన్నికల్లో అరాచకంగా వ్యవహరించిన వైసీపీ నేడు మున్సిపల్ ఎన్నిక నామినేషన్లలోనూ ‎ అదే విధంగా వ్యవహరించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ద్వజమెతారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల్ని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అన్ని విధాల ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలు సైతం దిక్కరించి గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దుల్ని ‎ నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. జగన్ అరాచ‎క పాలనకు ఇదే నిదర్శనం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్టలి పెట్టు, పోలీసు, రెవిన్యూ యంత్రాగాన్ని ఉపయోగించి, క్యాస్ట్ , ఇన్న్ కమ్, నో డ్యూస్ వంటి సర్టిపికట్ల విషయంలో కూడా టీడీపీ అభ్యర్ధుల్ని ఇబ్బందులకు గురి చేశారు. 328 నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా టీడీపీ అభ్యర్దలు 322 మాత్రమే వేశారు. మిగతా 6 చోట్ల వైసీపీ అరాచకం వల్ల నామినేషన్లు వేయలేకపోయా. జగన్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి, సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారనేది మరో సారి రుజువైంది. కుప్పంలో నామినేషన్ వేస్తున్న అభ్యర్ది వెంకటేష్ పై దా-డి-కి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారు. గత రెండున్నరేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతల్ని, ప్రజాసంఘాల్ని, ఎన్నికల్లో పోటీ చేసే వారిపై దా-డు-లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారు. వైసీపీ అరాచక పాలనలపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు బుద్ది చెప్పిన విధంగా మన రాష్ట్రంలో కూడా ఈ అరాచక పాలనకు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని జగన్ గ్రహించాలి.

tdp 0052021 2

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.... గురజాల నగర పంచాయితీలో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఈసీకి, ఎస్సీకి ఆదేశాలు ఇచ్చినా వాటిని దిక్కరించి టీడీపీ అభ్యర్ద్యుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటే ప్రభుత్వం వ్యవస్ధలను ఏవిధంగా నిర్వీర్యం చేస్తుందో ఇదే ఉదాహరణ. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ప్రభుత్వమే వ్యవస్ధలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించటం సిగ్గుచేటు. గత ఎన్నికల్లో అన్ని పత్రాలు సరిగా ఉన్నా టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు తొలగించారు. ఈ సారి కూడా అలా చేస్తారన్న భయంతో అన్ని నామినేషన్లకు ‎ చెక్ లిస్టును ఇచ్చాం. అవి ఈసీకి, కలెక్టర్ కి, కోర్టుకి, ఆర్వోకి మీడియాకు, సోషల్ మీడియాకు కూడా ఇచ్చాం. గత పంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారిని ఈ ఎన్నికలకు కూడా స్పెషల్ ఆఫీసర్ గా అక్కడే నియమించారు. ఆయన్ని తొలగించాలని కోర్టుని ఆశ్రయించాం. స్ధానిక వెలుగు అధికారులు, మహిళలతో పెద్దిరెడ్డి మీటింగ్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేల చేత ప్రతిపక్ష నేత చంద్రబాబుని బూతులు తిట్టించటం సిగ్గుచేటు. ఒక్క మీటింగ్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసిన ఘనత వైసీపి ప్రభుత్వానికే దక్కింది. ప్రధాన పక్షంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం సాగిస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read