పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్యోగసంఘాల నాయకుడా లేక మంత్రా అని, ఉద్యోగులు, ఉద్యోగసంఘాలు ఎన్నికల్లో పాల్గొనవని చెప్పడానికి ఆయనెవరని, టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకులమని చెప్పుకు తిరుగుతూ, అధికారపార్టీ కి ఊడిగం చేస్తున్న వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు వైసీపీ అధికారప్రతినిధులుగా నిన్నటికి నిన్ననే తీర్థం పుచ్చుకున్నారా అని టీడీపీనేత ఎద్దేవాచేశారు. తనకున్న అధికా రాలను ఉపయోగించి, రాజ్యాంగబద్ధమైన పదవిలోఉన్న ఎన్నికల కమిషనర్ , ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటినుంచీ వారి కొంప లేదో మునిగిపోయినట్లుగా సదరు ముగ్గురువ్యక్తులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకమిషనర్ తో తేల్చుకోకుండా, మంత్రులు, ఉద్యోగసంఘాల నేతలు చంద్రబాబుని ఎందుకు వారి రొంపిలోకి లాగుతారని రఫీ మండిపడ్డారు. హైకోర్టు డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా ఎన్నికలు జరపవచ్చని, వ్యాక్సినేషన్ కార్యక్రమా న్ని కూడాకొనసాగించవచ్చని చెబితే, ప్రజలప్రాణాలు ఎస్ఈసీకి పట్టవా అని ఉద్యోగసంఘాలనేతలు ప్రశ్నిచండం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుతఎన్నికలు జరగడం సదరునేతలకు ఇష్టం లేనట్లుగా ఉందన్న రఫీ, గతంలో అధికారపార్టీ వారు నామినేషన్లు కూడా వేయనీయకుండా ప్రతిపక్షాలపై ఎంతలా దాడులకు పాల్ప డ్డారో వారికి తెలియదా అని ప్రశ్నించారు. అటువంటి ఆటలేవీ నేడు నిమ్మగడ్డ ముందు సాగవన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉద్యోగసంఘా ల ముసుగేసుకున్న వైసీపీ ప్రతినిధులతో నోటికొచ్చినట్లు మాట్లాడి స్తోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఇస్తామ న్న డీఆర్సీ, పీఆర్సీ బకాయిలు, సీపీఎస్ రద్దు గురించి సదరు నేతలు జగన్ ను ఒక్కనాడైనా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కలెక్ట ర్లు ఆర్డర్లు జారీచేస్తే ఎన్నికల విధుల్లో పాల్గొనాలిగానీ, తాము ఎన్ని కలకు వెళ్లమని, ఉద్యోగులందరిదీ తమమాటే అన్నట్లు సదరు ఉద్యోగ సంఘాలనేతలు చెప్పడం చూస్తుంటే, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను వారుచదువుతున్నట్లుగా ఉందన్నారు. సజ్జల రామకృ ష్ణారెడ్డి, సాక్షి పేపర్ వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదువుతున్నట్లుగా ఉందన్నారు.

గతంలో వేలల్లోఉన్న కరోనా కేసులు, నేడు వందల్లోకి వచ్చాయని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులెవరికీ లేనికరోనాభయం, ఏపీ ఉద్యోగసంఘాల నేతలకే రావడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యాక్సి నేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగిందన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతరేతర సౌకర్యాల గురించి ప్రభుత్వంపై ఒత్తిడిచేయడం చేతగానివారంతా తాము ఉద్యోగసం ఘాల నాయకులని చెప్పుకుంటున్నారని రఫీ ఎద్దేవాచేశారు. ఎన్ని కల్లో పాల్గొనాల్సిందేనంటే వారిని చంపుతాం, వీరిని చంపుతాము అంటున్న వెంకట్రామిరెడ్డి, ఎస్ఈసీని చంపుతాడా...లేక ఎన్నికలు పెట్టవచ్చన్న హైకోర్టు న్యాయమూర్తులను చంపుతాడో సమాధానం చెప్పాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. ఎన్నికలనిర్వహణ అంతా తనచేతుల్లోనే ఉందన్నట్లుగా భావిస్తూ, వెంకట్రామిరెడ్డి హద్దులుమీరి మాట్లాడుతున్నాడన్నారు. బీహార్ లో , కర్ణాటకలో, కేరళ, రాజస్థాన్ లలో ఎన్నికలుజరిగినా, అక్కడ ఉద్యోగసంఘాలనేతలెవరూ వెంకట్రామిరెడ్డిలా మాట్లాడలేదన్నారు. ఆయన భాష చూస్తుంటే, వచ్చేఎన్నికల్లో వైసీపీటిక్కెట్ పై పోటీ చేయడానికి ఉత్సుకత చూపుతున్నట్లుగా ఉందన్నారు. వెంటనే గవర్నర్ స్పందించి వెంకట్రామిరెడ్డి భాషపై జోక్యంచేసుకొని, అతనిపై చర్యలు తీసుకోవాలని రఫీ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలను ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు విధిగా పాటించాల్సిందేనన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లినంత మాత్రా న అక్కడ ఎస్ఈసీకి వ్యతిరేకంగా తీర్పువస్తుందని ఎవరూ భావిం చాల్పిన పనిలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయనపార్టీ నేతలు పంతానికిపోయారుకాబట్టే, హైకోర్టుఆదేశాలను కూడా ధిక్కరిస్తూ మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలకమిషనర్ కు పంతాలకు పోవాల్సిన అవసరం లేదన్నా రు. పంచాయతీ ఎన్నికలు జరిగితే, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో లక్షా 40వేలమంది ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారని, వారి ఎన్నికతో అభివృద్ధికార్యక్రమాలు ఊపందుకుంటాయని రఫీ స్పష్టంచేశారు.

గతంలో పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తోనే కరోనా నయమవు తుందని ముఖ్యమంత్రిచెప్పినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలాదిమంది చనిపోతున్నారని ఉద్యోగసంఘాలనేతలు ఆయనకు చెప్పేధైర్యం ఎందుకుచేయలేదన్నారు. సినిమాహాళ్లు, మద్యం దుకాణాలు, పాఠశాలలు తెరిచినప్పుడు, ఉద్యోగులకు మద్యం దుకాణాలవద్ద విధులు కేటాయించినప్పుడు వెంకట్రామిరెడ్డి, బొప్ప రాజు వెంకటేశ్వర్లు ఎందుకు నోరెత్తలేదన్నారు. రవాణా వ్యవస్థ ప్రారంభమై, ఉద్యోగులంతా బస్సులు, రైళ్లలో రాసుకుపూసుకొని తిరుగుతున్నప్పుడు వారికి కరోనా వస్తుందని వారికి గుర్తకు రాలేదా అని టీడీపీనేత నిలదీశారు. ఒకక్రమపద్ధతిలో మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చేస్తూనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ చెబుతుం టే, అవేవీ ఉద్యోగసంఘాల నేతల తలకు ఎక్కడం లేదా అన్నారు. ప్రభుత్వానికి ఎన్నికలంటే భయమని తేలిపోయిందని, 20 నెలల ప్రజాకంటకపాలనలో ప్రజలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భయంతోనే, వైసీపీనేతలు ఎన్నికలకు జంకుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికఎన్నికలు ఎందుకు జరపలేదో అంబటిరాంబాబు సమాధానం చెప్పాలని రఫీ డిమాండ్ చేశారు. తమవైపు తప్పులు ఉంచుకున్న అధికారపార్టీనేతలు, ఆ నెపాన్ని ప్రతిపక్షంపైకి నెట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల కమిషనర్ గతంలోజరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేశాకే, ఎన్నికలనిర్వహణకు పూనుకోవాలన్నారు. రాష్ట్రం లోని అన్నిపార్టీలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పువచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్న ఉద్యోగసంఘాలనేతలు, అప్పటివరకు హైకోర్టు తీర్పుని ఎందుకు గౌరవించరని రఫీ నిలదీశారు. ఒకవ్యక్తి మెప్పుకోసం ఉద్యోగసంఘాలనేతలు బాకాఊదడం మానుకుంటే వారికే మంచి దని ఆయన సూచించారు. పొరుగురాష్ట్రంలో జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికలు జరిగినప్పుడు అక్కడున్న ఉద్యోగసంఘాలనేతలెవరూ, ఏపీలోని ఉద్యోగసంఘాలనేతల్లా మాట్లాడలేదన్నారు.ఉద్యోగసం ఘం నేతలుగా ఉన్నవారు మాట్లాడిన మాటలపై గవర్నర్ తక్షణమే జోక్యంచేసుకొని, వారిపైచర్యలు తీసుకోవాలని రఫీ డిమాండ్ చేశా రు. పశ్చిమబంగాల్ లో కేంద్రమంత్రిపై దాడిజరిగితే, అక్కడి గవర్నర్ ఎలా స్పందించారో ఒక్కసారి ఏపీ గవర్నర్ ఆలోచించాల న్నారు. ఎన్నికల కమిషనర్ కు సహకరించకుండా, రాజ్యాంగసం క్షోభం తలెత్తేలా మాట్లాడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకొని, రాజ్యంగహననం జరగకుండా నివారించాలని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read