బడుగు, బలహీనవర్గాల సంక్షేమాన్ని సమాధిచేసిన జగన్‌సర్కారు, ఆయావర్గాలను బలిపీఠంపైకి ఎక్కించిందని, సొంతకాళ్లపై నిలబడిమనుగడ సాగించేలా వారికి అవసరమైన ఆర్థికచేయూతను అందించకుండా అన్నమో రామచంద్రా అనేస్థితికి దిగజార్చిందని, టీడీపీసీనియర్‌నేత, మాజీమంత్రి కాలవశ్రీనివాసులు మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. జగన్‌సర్కారు బడుగు, బలహీనవర్గాలపై కక్షపూరితధోరణితో వ్యవహరిస్తోందన్న ఆయన, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందాల్సిన పింఛన్లలో భారీకోత విధించిందన్నారు. ఎన్నికలవేళ 45ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మహిళలకు, 45ఏళ్లు పైబడిన చేనేతమహిళలకు పింఛన్లు ఇస్తానన్న జగన్‌, తరువాత అనకాపల్లిసభ లో మేనిఫెస్టోలో లేదంటూ ఆనిర్ణయం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి అధికారంలోకి రాకముందే మాటతప్పాడన్నారు. నిన్నటికి నిన్న పంపిణీచేసిన పింఛన్ల లోకూడా రాష్ట్రప్రభుత్వం భారీగాకోతపెట్టిందన్నారు. చంద్రబాబుప్రభుత్వం 54లక్షల 14వేల 592మందికి పింఛన్లు పంపిణీచేస్తే, జగన్‌సర్కారు జనవరిలో వాటిని 48లక్షలకే పరిమితం చేసిందన్నారు.

పింఛన్‌దారుల వయస్సుని 65 నుంచి 60ఏళ్లకు తగ్గించిన ప్పుడు నిజంగాఅర్హులసంఖ్య పెరగాలన్నారు. అలానే టీడీపీ ప్రభుత్వం అనంతపురంలో అమలుచేసిన 10ఎకరాలమెట్టభూమి ఉన్న రైతులకు ఇచ్చేపింఛన్‌ని, తాను అధికారం లోకొస్తే, రాష్ట్రమంతా అమలుచేస్తాననిచెప్పిన జగన్‌, ఇప్పుడు దానిఊసే ఎత్తడంలేదన్నా రు. 60ఏళ్ల నిబంధనను అమలుచేస్తే, ప్రభుత్వలెక్కలప్రకారమే పింఛన్‌కు అర్హులైనవారు 6లక్షలమంది ఉంటారని, ఆసంఖ్య అదనంగా పింఛన్లజాబితాకు ఎందుకు జతకాలేదని మాజీమంత్రి నిలదీశారు. అదేవిధంగా 10ఎకరాలమెట్టభూమి నిబంధనను అమలు పరిచిఉంటే, దానిప్రకారం పింఛన్‌దారులసంఖ్య మరో 6లక్షలమంది ఉండేవారన్నారు. 01-01-2020నాటికి 53లక్షలమందికి మాత్రమే జగన్‌సర్కారు పింఛన్లు ఇచ్చి, లక్షపింఛన్లను కోసేసిందన్నారు. ఫిబ్రవరి జాబితాను పరిశీలిస్తే, పాతవి 48లక్షల 57వేలుంటే, కొత్తగా వైసీపీపాలనలో 6లక్షల11వేల పింఛన్లను జతచేయడం జరిగిం దన్నారు.

టీడీపీప్రభుత్వంలో 54లక్షలుగా ఉన్న పింఛన్‌దారుల సంఖ్య, వైసీపీవచ్చాక 48.57లక్షలకు ఎలా తగ్గిందో చెప్పాలని, అలానే 60ఏళ్లనిబంధనప్రకారం అర్హులైన వారు, 10ఎకరాలమెట్టభూమి నిబంధనదృష్ట్యా అదనంగాకూడవలిసిన పింఛన్‌దారుల సంఖ్య ఎలా తగ్గిందో, దానిలోని మతలబు ఏమిటో జగన్‌ చెప్పాలని కాలవ డిమాండ్‌ చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీచేయడం తనకెంతో గర్వకారణంగా ఉందని చెబుతున్న సీఎం, నిబంధనలపేరుతో పింఛన్లలో భారీగా కోతవిధించాడన్నారు. 300యూనిట్లు విద్యుత్‌వాడకం దాటినా, ఆధార్‌అనుసంధానంలేకపోయినా, రేషన్‌కార్డు లో వయసులో తప్పులున్నాయని, ఒకేరేషన్‌కార్డులోని సభ్యుల్లో ఒక్కరికే పింఛన్‌ఇస్తామనే నిబంధనలు సాకుగాచూపి, ప్రభుత్వం చాలామంది అర్హులనోట్లో మట్టిగొట్టిందన్నారు. ప్రభుత్వతప్పులు, సాంకేతికకారణాలవల్ల అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కు న్యాయం జరగలేదన్నారు. పింఛన్లపై ఆధారపడి బతికేవారందరికీ జగన్‌ ఏంసమా ధానం చెబుతాడని కాలవ నిలదీశారు. వాలంటీర్లు తమఅనుకున్నవారికే పింఛన్లు మంజూరుచేశారని, రాజకీయకారణాలు, వ్యక్తిగతవిబేధాలకారణంగా పింఛన్లపంపిణీలో అనేక అవతవకలు జరిగాయన్నారు.

టీడీపీప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల వారి ఆర్థికస్వావలంబనకోసం అనేకవిధాలుగా చేయూతనందిస్తే, జగన్‌సర్కారు ఆయావర్గాలవారు 'అన్నమో రామచంద్రా' అనేస్థితిని కల్పించిందని కాలవ మండిపడ్డారు. ఆయావర్గాలకు సబ్సిడీరుణాలు, పనిముట్లు అందించకుండా, ఆర్థికసహాకార సంస్థల కార్యక్రమాలను జగన్‌ప్రభుత్వం పూర్తిగా స్తంభింపచేసిందన్నారు. బీసీకార్పొరేషన్‌ నుంచి రూ.3432 కోట్లను, కాపుకార్పొరేషన్‌ నుంచి రూ.568కోట్లను, మైనారిటీకార్పొరేషన్‌నుంచి రూ.442కోట్లను, ఎస్టీకార్పొరేషన్‌నుంచి రూ.395 కోట్లను, ఎస్సీకార్పొరేషన్‌నుంచి రూ.1271కోట్లను, మొత్త 6,108కోట్లను అమ్మఒడికి మళ్లించా రని కాలవ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమనిధుల్ని అమ్మఒడి పథకానికి మళ్లించడంద్వారా, ఆయావర్గాలకు అందాల్సిన ఆర్థికసహాయాన్ని జగన్‌ దారిమళ్లించా డన్నారు. తానుప్రకటించిన పథకానికి ప్రత్యేకంగా నిధులివ్వడంచేతకాని జగన్‌, ఆయావర్గాల నిధులుమళ్లించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల వార్షిక ఆదాయానికి గండికొట్టాడన్నారు. జగన్‌కేబినెట్‌లోని ఆయావర్గాల మంత్రులు, శాసనసభ్యులు దీనిపై ఏం సమాధానం చెబుతారని, వారంతా ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని కాలవ సూచించారు. అసెంబ్లీలో జగన్‌ను పొగుడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులంతా, తమతమసామాజికవర్గాలవారు ఎంతనష్టపోతున్నారో, ఏవిధంగా నష్టపోతున్నారో తెలుసుకోవాలని టీడీపీనేత హితవుపలికారు.

రూ.3,400కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు నిలిపివేసిన జగన్‌సర్కారు, విద్యార్థు ల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. జగన్‌ తప్పిదంకారణంగా ప్రైవేటుకళాశాల ల విద్యార్థులు, వసతిగృహాల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలా మంది అప్పులుచేస్తూ నెట్టుకొస్తున్నారని కాలవ తెలిపారు. అనేకచోట్ల లెక్చరర్లే ఇన్‌ఛార్జ్‌ వార్డెన్లుగా ఉన్నారని, ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారంతా దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయారన్నారు. జగనన్న విద్యాదీవెన కింద ఏడాదికి ఒక్కోవిద్యార్థికి రూ.20వేలు ఇస్తానన్న జగన్‌, ఇప్పటివరకు ఒక్కరూపాయికూడా ఇవ్వలేదన్నారు. స్కాలర్‌షిప్పులపై ఆధారపడి విద్యనభ్యసించేవారంతా జగన్‌నిర్ణయం కారణంగా రోడ్డునపడే దుస్థితి వచ్చిందన్నారు. దీనిపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖలను చూస్తున్న మంత్రులు ఏంసమాధానం చెబుతారని శ్రీనివాసులు నిగ్గదీశారు. జగన్‌ ప్రకటనలకు , ప్రభుత్వ చేతలకు ఎక్కడా పొంతనలేదన్నారు. ఈవిధంగా నిరుపేదలసంక్షేమానికి సమాధికట్టిన జగన్‌సర్కారు, బడుగు, బలహీనవర్గాలను, దళితులు, మైనారిటీలను బలిపీఠంపై నిలబెట్టిందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read