టీటీడీకి రూ.300కోట్ల విరాళమిచ్చిన సూట్ కేసు కంపెనీ బాగోతంప్రజలకు తెలియాలని, ఆ కంపెనీ ముసుగులో టీటీడీ నిధులనుకాజేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సూట్ కేస్ కంపెనీని తెరముందుకు తీసుకొచ్చిన అదృశ్యహస్తమెవరిదో అందరికీ తెలియాలన్నారు. సదరు కంపెనీలో కే. సంజయ్ కేదారనాథ్ సింగ్ అనేవ్యక్తి డైరెక్టరని, ఆయన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డిలను కలిసి ఎంవోయూ కుదుర్చు కున్నాడని రామ్ ప్రసాద్ తెలిపారు. సదరుకంపెనీలో కొత్తగా తెలుగువాళ్లు డైరెక్టర్లుగాచేరారని, వారుచేరిన వారంరోజులకే సదరుసంస్థ టీటీడీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని చెప్పారని, యూరప్ లో అక్కడి ప్రభుత్వం నిర్మించిన పెద్దస్టేడియాన్ని తామే నిర్మించినట్లు ఉద్వే గ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చెప్పిందని రామ్ ప్రసాద్ పేర్కొ న్నారు. దానితోపాటు కాంట్రాక్టులు, ఫైనాన్సింగ్, కన్సల్టింగ్ వంటివి చేస్తున్నామనిచెప్పిన సదరు కంపెనీ దేశంలో ఎక్కడాలేనివిధంగా డొనేషన్లనుకూడా వ్యాపారంగా మార్చిందని, ఆ ఘనత సంజయ్ కేదార నాథ్ సింగ్ కే దక్కుతుందన్నారు. తక్కువ మొత్తాలను ఎక్కువమంది నుంచి సేకరించి, ఆ సొమ్ముని ఇంటర్నెట్ ద్వారా సేకరించి, ఎవరికిచేరవే యాలో వారికి చేరువచేస్తామని ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చెబుతోంద న్నారు. వ్యక్తులతోపనిలేకుండా అంతా సమాచార వ్యవస్థ ద్వారానే డొనేషన్ల సేకరణ, పంపిణీ జరుగుతుం దన్నారు. ఆ కంపెనీ టీటీడీకి (తిరుమల తిరుపతి దేవస్థానం) రూ.300కోట్ల డొనేషన్ ఇస్తామనడంతో, దానికి కాంట్రాక్ట్ ను అప్పగించి, ఒప్పందం కూడా చేసుకోవడం జరిగిందని బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. (ఎంఓయూ ప్రతులను ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ విలేకరులకు చూపించారు) ఎంఓయూలో ఏంరాశారో, సదరు సంస్థతో ఎలాంటి ఒప్పందం జరిగిందో సదరుసంస్థగానీ, టీటీడీ గానీ ఇంతవరకు బహిర్గతం చేయలేదన్నారు. అలిపిరి వద్ద రూ.400కోట్ల విలువైన పదిఎకరాల స్థలాన్ని సదరు కంపెనీకి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిం దన్నారు.

ఆ స్థలంలో ఏమినిర్మిస్తారో తెలియదని, సదరు సంస్థ డొనేషన్లు సేకరిస్తుందా..లేక టీటీడీఏ వారికి సమకూరుస్తుందా అనేదానిపై కూడాస్పష్టత లేదన్నారు. ఒప్పంద వ్యవహారానికి పదిహేనురోజుల ముందుజరిగిన టీటీడీ బోర్డ్ సమావేశంలో రూ.14 కోట్లను సదరుసంస్థకు కేటాయించారన్నారు. ఆ సంస్థ పిల్లల ఆసుపత్రి నిర్మిస్తున్నందున, అందుకోసం రూ.14కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పడం జరిగిందన్నారు. పదిఎకరా ల స్థలంలో సదరు సంస్థ పిల్లల ఆసుపత్రి నిర్మిస్తుందని టీటీడీవారు చెబుతున్నారని, రూ.14కోట్లను టీటీడీ కేటాయిస్తే, మిగిలినసొమ్ముని స దరు సంస్థ భరిస్తుందా లేక డొనేషన్ల రూపంలో సేకరి స్తుందా అనేదానిపైకూడా స్పష్టతలేదని రామ్ ప్రసాద్ తెలిపారు. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ 2018లో ప్రారంభించారని, ప్రారంభమైనప్పుడు దానిమూలధన పెట్టుబుడి జీరోగా ఉందని, 2019లో రూ.లక్షపెట్టుబడి పెట్టారన్నారు. 2020కి రూ.60వేలు ఖర్చుచేసినట్టుగా ఉందని, ఆ తరువాత 2018 నుంచి 2020వరకు ఎక్కడా ఎటువంటి వ్యాపారంచేసిన దాఖలాలు, లాభనష్టాల సమాచారమేది, సదరుకంపెనీ వివరాల్లో లేదని రామ్ ప్రసాద్ వెల్లడించారు. ఇప్పుడు కేవలం రూ.2,600మాత్రమే సదరు కంపెనీ కింద ఉన్నాయన్నా రు. అంతేగాకుండా ఇన్నేళ్లలో ఒక బ్యాంక్ తోగానీ, మరే ఇతరసంస్థలతో గానీ, వ్యక్తులతో గానీ ఎటువంటి లావా దేవీలు, వ్యవహారాలు నడిపిన దాఖలాలు కంపెనీకి లేవన్నారు. సదరుకంపెనీ 2020 మార్చి31నాటికి రూ.75,342కోట్ల నష్టాల్లోఉన్నట్లు ఆడిట్ రిపోర్టులు చెబుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా 3అడుగుల గోడకూడా కట్టని సంస్థ రూ.300కోట్లతో ఆసుపత్రి నిర్మిస్తామంటే కళ్లుమూసుకొని సరేననడం పలు అనుమానాలకు తావిస్తోందని రామ్ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు.

దేశవ్యాప్తంగా ఐటీపార్కులు, సెజ్ లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, హైక్లాస్ విల్లాలు నిర్మించామని, రియల్ ఎస్టేట్ రంగంలోఉన్నామని సదరుసంస్థ డైరెక్టర్ సంజయ్ కేదారనాథ్ సింగ్ ప్రచారంచేయడం జరిగిందన్నారు. వాస్తవంలో చూస్తే దేశంలో ఎక్కడాకూడా కనీసం ఒకమురికికాలువకూడా కట్టినఅనుభవం ఆసంస్థకు లేదన్నారు. ఇక ఆకంపెనీ బ్యాలెన్స్ షీట్లు చూస్తే, 2019-20 సంవత్సరానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.49,900మాత్రమేనని, అదేసమయంలో సంస్థనిర్వహణకు అయినఖర్చురూ.లక్షా25వేలని, ఆలెక్కన ఆకంపెనీకి వచ్చిన నష్టం రూ.75వేలుగా కనిపిస్తోందన్నారు. 2018లో ప్రారంభించిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి వచ్చినఆదాయం సున్నా రూపాయలని, అలానే 2019, 2020లోకూడా దానిఆదాయం సున్నాలతోనే ముగిసిందన్నారు. మరీదారుణంగా ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నిల్వచూస్తే, కేవలం రూ.271.40పైసలు మాత్రమేనని రామ్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. రూ.లక్షమూలధనం, రూ.లక్షలోపు ఆదాయం, కేవలం 26,634రూపాయల నికరనిల్వఉన్న కంపెనీ, ఏకంగా తిరుపతిలో రూ.300కోట్లతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడానికి ముందుకు రావడం చిత్రాతి విచిత్రంగా ఉందన్నారు. అటువంటి కంపెనీ గురించి ఏమీతెలుసుకోకుండానే, టీటీడీ ఒప్పందంచేసుకుందా అని రామ్ ప్రసాద్ నిలదీశారు. కనీస కసరత్తు చేయకుండా, సాధ్యాసాధ్యాలు, పుట్టుపూర్వోత్తరాలు పరిశీలించకుండా టీటీడీ అలాంటి సంస్థతో ఎలాఒప్పందంచేసుంటుందన్నారు? ఒప్పందంతీరుచూస్తుంటే టీటీడీపై కూడా పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

ఈ వ్యవహారం మొత్తంచూస్తేనే సదరు కంపెనీ బాగోత మేమిటో తెలిసిపోతోందన్నారు. కేవలం డొనేషన్ల ముసుగులో, వరల్డ్ క్లాస్ చిల్డ్రన్స్ ఆసుపత్రి కడతామ ని, అది జగన్మోహన్ రెడ్డి కలఅని, దాన్ని టీటీడీద్వారా తీరుస్తామని సదరు కంపెనీ చెప్డం జరిగిందన్నారు. కేవలం రూ. 2,600లు ఉన్నకంపెనీ, రూ.300కోట్లను ఎక్కడినుంచి సేకరిస్తుందో, ఎలా తెస్తుందో, దానికి ఉన్న సామర్థ్యమేమిటో, టీటీడీ సమాధానంచెప్పాలని రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. సదరుకంపెనీ వెనకున్నది ఎవరో, ఏ అదృశ్యహస్తానికి సాయంచేయడం కోసం టీటీ డీ రూ.400కోట్ల విలువైన భూమిని, రూ.14కోట్ల ధనా న్ని ఇవ్వాలనిచూసిందో సమాధానంచెప్పాలన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై దృష్టిసారించాలన్నా రు. నిజంగా టీటీడీ వారు చిన్నపిల్లలఆసుపత్రి నిర్మిం చాలనుకుంటే, అనేకమంది దాతలు అందుకు సాయం చేయడానికి సిద్ధంగాఉన్నారని, అలాంటప్పుడు అనా మకకంపెనీ ముసుగులోఇంతవ్యవహారం నడపాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలన్నారు. టీటీడీ ఆధ్వర్యం లో ఇప్పటికే రుయా, బర్డ్స్ ఆసుపత్రి వంటివి నడుస్తున్నాయన్నారు. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ముసుగులో సంజయ్ కేదారనాథ్ సింగ్ అనే వ్యక్తిని అడ్డుపెట్టుకొని టీటీడీ సొమ్ముని కాజేయాలని చూస్తున్నారని, వారెవరో వెంటనే బహిర్గతంచేయాలని రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను చూస్తుంటే, గతంలో వోక్స్ వ్యాగన్ వ్యవహారం గుర్తు కొస్తుందన్నారు. ఆనాడు రూ.11కోట్లు ముందే ఇచ్చేసి, తరువాత సొమ్ములుపోనాయి నానేటి సేత్తానుఅన్న వ్యక్తి గురించి ఇంకా ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు. ఆ వ్యక్తే ఇప్పుడు రాష్ట్రప్రభుత్వంలోకూడా ఉన్నారని, కాబ ట్టి, టీటీడీ ఒప్పందంచేసుకున్న ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వెనకున్నదెవరో కూడా ప్రభుత్వం నిగ్గుతేల్చాల ని టీడీపీనేత డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న లిబర్టీ స్టీల్స్ కంపెనీ ఎలా పుట్టుకొచ్చిందో, ఇప్పుడు ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కూడా అలాంటిదేనన్నారు. పెద్ద పెద్దకంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితిలేకపోవడంతో, ప్రభుత్వంఇటువంటి సూట్ కేసు కంపెనీలను తెరపైకి తెస్తోందనే అనుమానం తమకు క లుగుతోందన్నారు.

ఈవ్యవహారంపై ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని, నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని రామ్ ప్రసాద్ పత్రికాముఖంగా డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.300కోట్ల విరాళం ఎక్కడినుంచి వచ్చింది, ఇచ్చిందెవరు.. ఆ కంపెనీ వివరాలేమిటో ఎం దుకు చెప్పలేకపోతున్నారన్నారు. సదరు ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చిరునామా ముంబైలో చూపారని, అక్కడ ఆఫీస్ మెయింటెన్ చేయాలంటే కనీసం నెలకు రూ.లక్షవరకు అద్దెచెల్లించాలని, రూ.2,600లు ఉన్న కంపెనీ అంతటి అద్దెలు ఎలాచెల్లిస్తుందో ఎవరికైనా అనుమానం కలుగుతుందన్నారు. ముంబైలోని హీరానందిని ఎస్టేట్ రోడ్ లో ఉన్నకంపెనీలో, డైరెక్టర్లుగా ఉన్న సంజయ్ కేదారనాథ్ సింగ్, వందనా సింగ్ లకు చెరో ఐదువేలచొప్పున పదివేలషేర్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఒక్కోషేరు విలువ రూ.10చొప్పున వేసుకున్నా, ఇద్దరిషేర్ల విలువ కేవలం రూ.లక్షరూపా యలే ఉంటుందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సూట్ కేసు కంపెనీల చిరునామానే ఈ కంపెనీకి కూడాఉందనే అనుమానం తమకు కలుగుతోం దన్నారు. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.300కోట్లతో ఆసుపత్రిని నిర్మిస్తామనడం వెనుక పెద్దగూడుపుఠాణీ యేఉందన్న రామ్ ప్రసాద్ , ఈ వ్యవహారమంతా ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతోందన్నారు. అసలు ఏమాత్రం సామర్థ్యంలేని తూతూమంత్రపు కంపెనీని టీటీడీ ఎలానమ్మిందో, ఎవరి సిఫార్సుతో ఒప్పందం చేసుకుందో, ఎలా చేసుకుందో వెంటనే బహిర్గతపర చాలన్నారు. టీటీడీలో ఏ వ్యవస్థా సరిగా పనిచేయడం లేదని, ఎవరైనా రూ.10కోట్లు ఇస్తామంటే వెంటనే తీసుకెళ్లి ఎంఓయూలు చేసుకుంటున్నారని, అందుకే తాము అనుమానించాల్సి వస్తోందన్నారు. నిన్నటికి నిన్న తలనీలాల వ్యవహారంకూడా అందరం చూశా మన్నారు. టీటీడీలోని డొల్లతనం, స్వార్థం, అవినీతికి ఆస్కారమిచ్చేవ్యవహారాలు ఇటువంటి ఘటనలతోనే బయటపడుతున్నాయన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read