Sidebar

02
Fri, May

ఇక చంద్రబాబు ఓర్పు నశించింది... కేంద్రం పై మలి విడత పోరాటానికి చంద్రబాబు సిద్ధం అయ్యారు.. కొన్ని నెలలుగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి, ఆందోళనలు చేసి, ఒక పద్దతిగా పోరాటం చేసినా, బీజేపీ దిగిరాక పోవటంతో, ఇక చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు.. ఈ ఉదయం చంద్రబాబుతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, విభజన హామీల అమలుపై చర్చించారు... నిన్నటి సమావేశంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో, ఇక బీజేపీ చేసేది ఏమి లేదనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు... అదే విధంగా, చంద్రబాబు కూడా ప్రతి విషయంలో కేంద్ర వైఖరి బేరీజు వేసుకుని, ఇక కేంద్రం ఏమి చెయ్యదు అనే విషయాన్ని నిర్దారించుకున్నాట్టు తెలుస్తుంది.

tdp bjp 02032018 2

రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు... దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు.. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు... విభజనచట్టం హామీలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు హోదా-ప్యాకేజీ మతలబును లేఖలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు... ప్రజలు, పార్టీ క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా.. నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ఎంపీలు పట్టుబట్టినట్లు సమాచారం... 5 నుంచి పార్లమెంట్‌లో మళ్లీ పోరాటం చేయాలని నిర్ణయం టీడీపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

tdp bjp 02032018 3

మరో పక్క ఎంపీలు కూడా ఆగ్రహంగా ఉన్నారు... కేవలం వీరు చంద్రబాబు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు... విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన రాకపోతే ఎక్కడా రాజీ పడేది లేదని, మిత్రపక్షమైనా వదిలి పెట్టేది లేదని చెప్తున్నారు... కేంద్ర మంత్రులు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని, ఒక పద్దతి ప్రకారం, మన వైపు వేలు చూపించకుండా, అంచల వారీగా ఆందోళన చేస్తున్నామని, సమయం రాగానే, మంత్రుల రాజీనామా, ఎన్డీయే నుంచి బయటకు రావటం, అవిశ్వాసం లాంటి కార్యక్రమాలు చేస్తామని, మనకు జరిగిన అన్యాయం దేశం మొత్తం అర్ధమయ్యేలా పార్లమెంట్ లో మరో సారి ఆందోళన చేస్తామని చెప్తున్నారు... మన ఆందోళనకు కేంద్రం తలొగ్గటం, రాష్ట్రానికి మంచి జరగటం...లేదా బీజేపీ వైఖరిని దేశం మొత్తానికి చెప్పటమే మా ఎజెండా అని అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read