రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన తీవ్రంగా చెయ్యాలని టిడిపి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే...అయితే, కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తే, తమకు మరింత ఇబ్బంది అవుతుందని, భావిస్తున్న బీజేపీ, తొలి రోజే టిడిపి ఎంపీలను సస్పెండ్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది... టిడిపి ఎంపీలను ముందు రోజే సస్పెండ్ చేసి, వారిని పొమ్మనకుండా పొగ పెట్టే కార్యక్రమం చేస్తుంది బీజేపీ... అయితే ఈ వ్యూహాన్ని పసిగట్టిన చంద్రబాబు, కౌంటర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు... ఇప్పటికే, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, తాము చేస్తున్న పోరాటానికి మద్దతు కోరుతూ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు తెదేపా జాతీయ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు...

cbn 04032018 2

అయితే, తొలి రోజే టిడిపి ఎంపీలను సస్పెండ్ చేస్తే, ఉభయసభల బయట ఆందోళన చెయ్యాలని టిడిపి నిర్ణయించింది... ప్రతి రోజు వచ్చి పోయే ఎంపీలకు, రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న వివక్షను వివరించనున్నారు... అలాగే రోజుకి ఒక టాపిక్ తీసుకుని, దాని పై నేషనల్ మీడియాతో జరిగిన అన్యాయాన్ని వివరిస్తారు... వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతారు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థిల దృష్ట్యా కేంద్రంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించ డానికి న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది..

cbn 04032018 3

కేంద్రం రష్ట్రానికి నిధులకేటాయింపుల్లోను, విభజన చట్టం అమల్లోను,షెడ్యూల్‌ 9,10,11,13లను గాలికి వదిలేసి కేవలం ఎంపీల ఆందోళనను అడ్డుకోవ డానికే తరచూ రాష్ట్రంతో కేంద్రం చర్చలతో కాలయా పనను రాష్ట్రం గుర్తించి జాగ్రత్త పడుతోంది.ఈ నేపధ్యంలో ఉభయ సభల్లో టిడిపి ఎంపీల ఆందోళన అడ్డుకునే ప్రయత్నం చేయడంకానీ,సస్పెండ్‌ చేయడం కానీ జరిగితే ఉభయసభల బయట ఎంపీలు తారా స్థాయిలో నిరసనకు సిద్ధపడ్డారు... సస్పెండ్ చేస్తే, దేశానికి మనకు జరిగిన అన్యాయం తెలియాలంటే, ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటేనే, మన సమస్యలు గురించి వింటారని, ఆ దిశగా మా కార్యాచరణ ఉంటుంది అని, ఎంపీలు చెప్తున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read