సోమవారం నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటమే పనిగా వైసీపీ పెట్టుకుందని, ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబుని పర్సనల్ గా టార్గెట్ చేసి, ఆయన్ను కించపరచటమే పనిగా పెట్టుకున్నారు. దీని వెనుక వైసీపీ వ్యూహం ఏమిటో కాని, చంద్రబాబు మాత్రం, వైసీపీకి లొంగటం లేదు. అసెంబ్లీలోనే ఉంటూ, అధికార పక్షాన్ని నిలదీస్తూనే ఉన్నారు. అధికార పక్షం ఎంత కించపరిచినా, చంద్రబాబు మాత్రం, ఎక్కడా వెనకడుగు వెయ్యటం లేదు. ఇదే కోవలో, నిన్న మార్షల్స్ చంద్రబాబుని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా చంద్రబాబునే, గేట్లు మూసేసి ఆపేయటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అనూహ్యంగా వైసీపీ, ఇది కూడా తమకు అనుకూలంగా మలుచుకుంది. చంద్రబాబే మార్షల్స్ పై దాడి చేసారు అంటూ, కొన్ని క్లిప్పింగ్స్ అసెంబ్లీలో ప్లే చేసారు. అందులో చంద్రబాబుతో పాటుగా, ఇతర టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మేల్సీలు వస్తూ ఉండగా, అక్కడ అసెంబ్లీ గేట్లు మూసేసారు.

assembly 13122019 2

ఈ సందర్భంగా, టిడిపి నేతలకు, మార్షల్స్ మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఇదే సమయంలో గేటు ఎంతకీ తెరవకపోవటంతో, చంద్రబాబు ఆగ్రహంగా ముందుకు వచ్చి, గేటు తియ్యమని, చీఫ్ మార్షల్ పై అరిచారు. అయితే ఆయన బాస్టార్డ్ అంటూ తిట్టారని, వైసీపీ హడావిడి చేసింది. చంద్రబాబు ఒక ఉద్యోగిని బాస్టార్డ్ అంటూ తిట్టారని, చంద్రబాబుని క్షమాపణ చెప్పాలని, లేకపోతె అసెంబ్లీ నుంచి సస్పెండ్ చెయ్యాలని వైసీపీ కోరింది. అయితే చంద్రబాబు మాత్రం, తాను బాస్టర్డ్ అని అనలేదని, కావాలంటే రికార్డులు చూసుకోండి అంటూ చెప్పటంతో, ప్రభుత్వం చంద్రబాబు పై చర్యలు తీసుకోవాల్సిందిగా తీర్మానం ప్రవేశ పెట్టింది. ఆ అధికారాలు అన్నీ సభ స్పీకర్ కు ఇచ్చింది.

assembly 13122019 3

అయితే ఉదయం నుంచి చంద్రబాబుని, ఈ అసెంబ్లీ సెషన్ అయ్యేంత వరకు సస్పెండ్ చేస్తారని, ప్రచారం జరిగింది. మీడియా వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచారం జరగటంతో, చంద్రబాబుని సస్పెండ్ చెయ్యటం ఖాయంగా అందరూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ సస్పెన్షన్ నిర్ణయం ఆగిపోయింది. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ స్పెకర్ ను కలిసి, ఒక రిప్రజంటేషన్ ఇచ్చి, జగన్ పై చర్యలు తీసుకోవాలని, ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చింది. చంద్రబాబు అనని మాటలు, అన్నట్టుగా సభను తప్పుదోవ పట్టించారని, నిజానికి చంద్రబాబు "నో క్వశ్చన్" అని చంద్రబాబు అంటే, దాన్ని వక్రీకరించారని, కావాలంటే వీడియో చూడండి అని చెప్పటంతో, చంద్రబాబు పై సస్పెన్షన్ నిర్ణయం అమలు కాలేదు. ఆ వీడియో చూస్తే నిజంగానే, "నో క్వశ్చన్" అని చంద్రబాబు అన్నట్టు ఉంది. మరి స్పీకర్ దీని పై సోమవారం అయినా, ఏమైనా నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read