ఏపీ శాసనసభను, ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచే విధంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... అసెంబ్లీలో ఆయనపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. రూల్ 169 కింద అసెంబ్లీ స్పీకర్ కోడెలకు నోటీసులను అందజేశారు. ట్విట్టర్ వేదికగా జీవీఎల్ చేసిన కామెంట్ ను నోటీసుకు జత చేశారు. 'సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారితో ప్రవర్తించిన తీరు చూస్తే 'పిచ్చి పీక్స్ కు' చేరినట్టు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో ఉన్న సీఎం అసెంబ్లీ రౌడీలా ప్రవర్తించారు. సీఎంపై సభాహక్కుల నోటీసును ఇచ్చే ఆలోచన ఉంది' అని జీవీఎల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

gvl 05022019

ఇది జరిగింది.. రెండు రోజుల క్రితం విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, కేంద్రం అన్ని ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది అని చెప్తూ ఉన్న వేళ, చంద్రబాబు మైక్ అందుకుని ఫైర్ అయ్యారు. ఒకసారి గుజరాత్ కు వెళ్లి చూడవయ్యా, కంపేర్ చెయ్యి, కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసిది పోయి, సిగ్గు వదిలిపెట్టి, మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలా? రోషం లేదా మాకు అంటూ మండిపడ్డారు. ఇక ఆ సమయంలో ‘అబ్జెక్షన్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే, తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

gvl 05022019

ప్రజల ఆవేదన చంద్రబాబు బాగా వ్యక్తపరిచారు అని అందరూ ఆనందిస్తుంటే, జీవీఎల్ మాత్రం, తన బానిసత్వపు పోకడలు బయట పెట్టారు. "తమ పార్టీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజుతో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని, సీఎం ప్రవర్తన చూస్తే పిచ్చి పీక్స్ కు చేరినట్లు తెలుస్తుందని, మహా ఫ్రస్టేషన్ లో ఉన్న సీఎం అసెంబ్లీ రౌడీ లా ప్రవర్తించారంటూ తన ట్విట్లర్ లో పేర్కొన్నారు. సీఎం తీరుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్లు జీవీఎల్ తెలిపారు. అయితే జీవీఎల్ తీరు పై ప్రజలు మండిపడుతున్నారు. జీవీఎల్ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అంటూ ప్రజల నుంచి రియాక్షన్ రావటంతో, ఈ రోజు టిడిపి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. స్పీకర్ కనుక సీరియస్ గా తీసుకుంటే, జీవీఎల్ ను సభకు పిలిచి మరీ వివరణ ఇచ్చి, తప్పు చేస్తే క్షమాపణ చెప్పించే అవకాసం కూడా ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read