ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే సంఖ్యా బలం చూస్తే, నాలుగు సీట్లు వైసిపీకే దక్కుతాయి. కాని తెలుగుదేశం పార్టీ మాత్రం, వ్యుహత్మికంగా పోటీకి పెట్టింది. ఇందుకు కారణం రెండు కనిపిస్తున్నాయి. ఒకటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దళితుల పై జరుగుతున్న దాడులు, డాక్టర్ సుధాకార్ వంటి వారి పై దాడి, ఇలా అనేక విషయాలు జరుగుతూ ఉండగానే, రాజ్యసభలో అవకాసం ఉన్నా, దళితులకు అవకాసం ఇవ్వకపోవటం. ఇప్పటికే విజయసాయి రెడ్డి, వెం రెడ్డి ఉండగా, ఇప్పుడు అయోధ్య రామి రెడ్డి, ఇక్కడ శాసనమండలి రద్దు అవుతుంది ఏమో అని, మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అలాగే మరొక అభ్యర్ధి, రిలయన్స్ సన్నిహితుడు జార్ఖండ్ కు చెందిన పరిమళ నత్వాని. అయితే దళితులకు అన్యాయం చేస్తుందని నిరసిస్తూ, తెలుగుదేశం వర్ల రామయ్యను పోటీకి పెట్టింది. ఇక మరొక కారణం, తెలుగుదేశం పార్టీ రెబెల్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వెయ్యటం కోసం.

కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీలకు కూడా తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. అయితే, వంశీ, బలరాం, గిరి ప్రెస్ మీట్లు, వీళ్ళు చంద్రబాబు పై పౌరుషంగా మాట్లాడటం, అదే విధంగా జగన్ ని ఆకాశానికి ఎత్తుతూ పొగడటం, మేము జగన్ అభివృద్ధి చూసి జగన్ వైపు వచ్చాం, తెలుగుదేశం పార్టీ పని అయిపొయింది అంటూ చెప్పటం చూసిన వారు, వీరు టిడిపి ఇచ్చిన విప్ ధిక్కరించి, వైసిపీ చెప్పిన అభ్యర్ధికి ఓటు వేసి, జగన్ పై తమ ప్రేమ చూపిస్తారని అందరూ అనుకున్నారు. అయితే వీరి మాటలు అన్నీ బిల్డ్ అప్ వరుకే అని తేలిపోయింది. టిడిపి విప్ ధిక్కరిస్తే, అనర్హులం అవుతాం, ఎమ్మెల్యే పదవి పోతుంది అని ఈ టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు భయపడ్డారో, లేక ఉప ఎన్నికలు వస్తే, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఈ సమయంలో, ఇప్పుడు పోటీ చేసే వాతవరణం లేదు అని అధికార పార్టీ భయపడిందో కాని, మొత్తానికి, చెల్లకుండా ఓటు వేసి, ముగ్గురు టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. దీంతో జగన్ కు మద్దతు తెలపలేకపోయారు. తమకు తమ పదవులే ముఖ్యం అని చాటుకున్నారు. దీంతో తెలుగుదేశం ప్లాన్ ఫలిచింది. విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వెయ్యాలని, చెల్లకుండా వేస్తే, తమకు జగన్ కంటే, పదవులే ముఖ్యం అని వారే తెలిపినట్టు అవుతుందని, తెలుగుదేశం వేసిన అంచనా కరెక్ట్ అయ్యింది. ఇన్ని కబుర్లు చెప్పిన రెబెల్ ఎమ్మెల్యేల హడావిడి అంతా, ఉత్తిదే అని టిడిపి అంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read