దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైసీపీ, బీజేపీ నేతలు ఒక్కటయ్యారు. రాష్ట్ర పీఏసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్లు నిన్న వార్తలు వచ్చయి. అయితే, అటు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కాని, మేము రామ్‌మాధవ్‌తో భేటీ కాలేదు అని, ఇవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పారు. కార్ లో తిరిగే వీడియో కాకుండా, రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్టు ఆధారాలు చూపాలని ఉదయం, వీరు ఛాలెంజ్ చేసారు. అయితే, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఈ విషయం పై స్పందించారు. వీరు చెప్పేవి అన్నీ అబద్ధాలు అని, రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చూపించారు.
వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, పీఏసీ చైర్మన్ కావటంతో, ఆయనకు ప్రభుత్వం కార్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళగానే, ఏపి భవన్ నుంచి ఒక కార్, ఆయనకు కేటాయించారు. తరువాత, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే కారులో తిరిగారు. అయితే, వీరు రాం మాధవ్ ఇంటికి వెళ్లినట్టు ఆరోపణలు వస్తుంటే, అవి నిజమే అని తేలింది. ప్రభుత్వ వాహనం కావటంతో, వీరు ఎక్కడికి వెళ్లారు అనే విషయం లాగ్ బుక్ లో ఎంటర్ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. దీంతో, ఢిల్లీ లో బుగ్గన, ఆకుల రాం మాధవ్ నివాసానికి వెళ్ళినప్పుడు లాగ్ పుస్తకం లో సంతకాలు చేసిన ఆధారాలు తెదేపా ఎంపీలు బయట పెట్టారు.
గురువారం ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారులతో కూడా కన్నా, పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చర్చలు జరిపారు. మరోవైపు బుగ్గన, ఆకుల కలిసి రామ్‌మాధవ్‌తో సమావేశం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ ఒకే కారులో ఏపీ భవన్‌కు రావడం విశేషం. గురువారం సాయంత్రమే బుగ్గన ఢిల్లీనుంచి బయలుదేరి వెళ్లగా ఆకుల మాత్రం అక్కడే బస చేశారు. ఈ భేటీ రాజకీయంగా సంచలనం సృష్టించింది. బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయంటున్న తమ ఆరోపణలు అక్షరాలా నిజమని మరోసారి రుజువైందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ, బీజేపీ ఒక్కటయ్యాయన్న విషయం సామాన్య ప్రజలకు కూడా అర్థమైందని... జగన్ ఆదేశాల మేరకే బుగ్గన బీజేపీ నేతలను కలిశారనడంలో సందేహం లేదని టీడీపీ ఎంపీ లు అన్నారు.