తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ మేఘాలయ ఎన్నికల్లో బోనీ కొట్టాడు. కొన్నేళ్ల క్రితం వరకూ ఐ ప్యాక్ ప్రశాంత్ కిశోర్ టీములో కీలకంగా ఉన్న రాబిన్ శర్మ తన సొంత కంపెనీ షోటైమ్. టిడిపికి వ్యూహకర్తగా రాబిన్ శర్మ మౌనంగా పనిచేసుకుంటూ వెళతారు. అయితే టిడిపియే పెద్ద స్ట్రాటజిస్టుల పాఠశాల కావడంతో రాబిన్ శర్మకి అంత ఫోకస్ లేదనే అభిప్రాయం ఉంది. కన్సల్టెన్సీ కంపెనీ పేరు షో టైమ్ అయినా, రాబిన్ శర్మ షో చేయడు. అందుకే రాబిన్ శర్మ ఫోటోలు కూడా నెట్లో పెద్దగా దొరకవు. దీంతో మరో ప్రఖ్యాత రచయిత రాబిన్ శర్మ ఫోటోలు వ్యూహకర్త రాబిన్ శర్మగా ప్రచురించడం చూస్తుంటాం. అంతగా లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే షోటైమ్ రాబిన్ శర్మ మేఘాలయ ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేశాడు. ఏంటో విశేషం అని తరచి చూస్తే మేఘాలయలో ఎన్నికల్లో గెలుపొందిన ఎన్‌పీపీ విజయం కోసం రాబిన్ శర్మ టీం పని చేసింది. అంటే తన సొంత కంపెనీ షో టైమ్ నుంచి తొలి బోణీ కొట్టాడన్నమాటే. ఏపీలో కూడా వైసీపీకి తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉన్న నేపథ్యంలో టిడిపి గెలుపు ఖాయమని, ఇది రాబిన్ శర్మకి మంచి బూస్ట్ ఇస్తుందని అనలిస్టుల మాట. టిడిపి మొదట్లో రాబిన్ శర్మతో ఒప్పందం చేసుకున్నా అంటీముట్టనట్టు వ్యవహరించింది. టిడిపికి కూడా ప్రత్యేకమైన స్ట్రాటజీ బృందాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి పనిచేసే అవకాశం లేకపోవడం, రాబిన్ శర్మ మౌనం కలిసి ఉన్నాడా లేడా అనేటట్టు ఉండేది పరిస్థితి. ఒక్కసారిగా టిడిపి కార్యక్రమాలు జోరందుకోవడంలో రాబిన్ శర్మ పాత్ర ఉందని అప్పుడు అందరికీ అర్థమైంది. బాదుడే బాదుడుతో మొదలు పెట్టి, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి రాబిన్ టీము కార్యక్రమాలే. వీటి లాంఛింగ్ సమయంలో వేదికపైకి వచ్చారు రాబిన్ శర్మ. ఇటీవల టిడిపి కేడర్‌లో ఊపు తెస్తోన్న సైకో పోవాలి-సైకిల్ రావాలి పాట రాబిన్ టీము రూపొందించినదేనని టాక్ వినిపిస్తోంది.
టిడిపి రాబిన్ శర్మ మేఘాలయలో బోణీ కొట్టాడు..నెక్ట్స్ ఏపీయేనా?
Advertisements