తాను నేడు మీడియాతో మాట్లాడుతున్న బాధాకర మైన మాటలను తాడేపల్లి ప్యాలెస్ లో ఖాళీగా కూర్చు న్న ముఖ్యమంత్రి వినాలని, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, వివేకా కూతురు సునీత హస్తినాపురంలో రోడ్లపై తిరుగుతూ, అక్కడి వీధుల్లో ఆర్తనాదాలు చేస్తోందని, అమెఘోష ఈ ముఖ్యమంత్రికి వినపడుతోందా అని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. శని వారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లో... "తన తండ్రి హ-త్య జరిగి రెండేళ్ల 18 రోజులైనా ఎవరు చం-పా-రో తెలియడంలేదంటూ వి-వే-కా కూతురుహస్తినా పురవీధుల్లో ఎక్కేగడప, దిగేగడప తిరుగుతూనేఉంది. తన తండ్రిని ఎవరు చం-పా-రం-టూ ఆమె చేస్తున్న ఆర్త నాదాలు, ముఖ్యమంత్రికి ఎందుకని ఒకింతకూడా జాలి కలిగించడంలేదు. సొంతచెల్లెలు తెలంగాణలో తిరుగు తోందని, ఆమెకూడా జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా లేద ని చెప్పుకుంటూ ఉన్నారు. ఢిల్లీలో సునీత నిన్న మీడి యాతో మాట్లాడారు. ఆమె చాలా బాధాతప్తహృదయం తో మాట్లాడుతూ, తన తండ్రిని ఎవరు చం-పా-రో మీరైనా తెలుసుకోండంటూ పాత్రికేయులను వేడుకున్నారు. ఆమె ప్రెస్ మీట్ చూస్తే ఎంతటి కరుడుగట్టిన, కర్కశహృ దయమైనా కరిగి నీరవుతుంది. ఆమె విలేకరుల సమా వేశాన్ని ఈముఖ్యమంత్రి చూశారా లేదా? అసలు చూసే ధైర్యం చేశారా? మార్చి15, 2019న తెల్లవారుజామున జరిగిన రాజకోట రహస్యమేమిటి? పులివెందుల రాజకో టలో జరిగిన రహస్యమేంటి? వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా పనిచేసి, అందరితో మంచివా డు అనిపించుకున్న వ్యక్తి మరణిస్తే, అందుకు సంబం ధించిన రాజకోట రహస్యం జగన్మోహన్ రెడ్డికి తెలుసు నని సునీత చెబుతోంది. "
"ఆ రహస్యం ముఖ్యమంత్రికి తెలుసు. ప్రతిపక్షనేతహోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కూడా కోరారు. ఇంకోదుర్మార్గమైన పని కూడా ఆయన చేశాడు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబువైపు తనవేలుచూపి, ఆతరువాత ఆవేలుని వెనక్కుమడిచారు. సీబీఐ విచారణకావాలని వివేకానం దరెడ్డి భార్య సౌభాగ్యమ్మతోపాటు, జగన్మోహన్ రెడ్డి హై కోర్టులో రిట్ పిటిషన్ వేసింది నిజంకాదా? ముఖ్యమంత్రి అయ్యాక మరలా తనరిట్ పిటిషన్ ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనక్కు తీసుకున్నాడు? బాహ్యప్రపంచానికి, సీబీఐకి ఆ రాజకోట రహస్యం తెలియకూడదని, అది అలానే ఉండిపోవాలని ఆపనిచేశారా? సీబీఐ విచారణ జరిగితే ముద్దాయిలు బయటకువస్తారని జగన్ కుతెలుసు. అదే అసలురాజకోట రహస్యం. తాను సినిమా రాజకోట రహస్యం గురించి మాట్లాడటంలేదు. పులివెందుల రాజకోట రహస్యం ఏమిటో చెప్పాలంటున్నా. అన్నివేళ్లు నేడుముఖ్యమంత్రి ముఖంవైపే చూపిస్తున్నా యి. పులివెందులలో ఎవరూ ధైర్యంగా బయటకురాక పోవచ్చు. ఢిల్లీలో సునీత మాట్లాడిన మాటలకు సమా ధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? సునీత ఢిల్లీ లో పెట్టిన ప్రెస్ మీట్ పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పం దించలేదు? ఆమె అడిగిన ప్రశ్నలన్నీ ముఖ్యమంత్రినే కార్నర్ చేస్తున్నాయి. రాజకోట రహస్యాన్ని ముఖ్యమం త్రి ఎందుకు గుండెల్లో దాచుకున్నారు? నిజంగా అమ్మ తోడు నాకుతెలియదని చెప్పేధైర్యం ముఖ్యమంత్రికి ఉం దా? వివేకా కేసు విచారణలో న్యాయస్థానాలను ఆశ్ర యించడంపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము." అని అన్నారు.