తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ, ఇది కౌరవ సభ, గౌరవ సభ కాదు, మళ్ళీ సియం అయిన తరువాతే, ఈ గౌరవ సభలోకి అడుగు పెడతాను అంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ ఆ పార్టీకి ఎంత ముఖ్యమో తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ ప్రక్రియ మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికలకు అభ్యర్ధులు ఎంపిక ఎంత ముఖ్యమో, పార్టీ గుర్తించింది. ఇప్పటికే చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. ఈ సమీక్షల్లో చంద్రబాబు, పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్ళని, సస్పెండ్ చేయటం కూడా మొదలు పెట్టారు. అలాగే పనులు చేయకుండా, కేవలం ఫోటోలకు, ఫోజులు ఇచ్చే వారి పైన, కఠినంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు వారికి వార్నింగ్ ఇచ్చి, పధ్ధతి మార్చుకోవాలని చెప్తున్నారు. ఇక ఎన్నికలకు రెండేళ్ళ సమయం ఉండటంతో, ఇప్పటి నుంచి అభ్యర్ధుల ఎంపిక పై చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు. ఇది వరకు లాగా, చివరి నిమిషం వారకు నాన్చే ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటి నుంచి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టారు. జిల్లల్లోకి సర్వే టీమ్స్ ని చంద్రబాబు పంపించారు. ప్రతి జిల్లాకు వెళ్తున్న ఈ సర్వే టీమ్స్, స్థానికంగా ఆన్ని విషయాల పై అధ్యయనం చేస్తున్నాయి.

cbn 13122021 2

నేతలు, కింద స్థాయి నాయకులు, క్యాడర్, ప్రజలు, ఇలా అందరి అభిప్రాయాలూ తీసుకుంటున్నారు. పలానా నేత ఎలా పని చేస్తున్నారు, వేరే నేత అయితే ఎలా ఉంటుంది, ఎవరు ప్రజల్లో ఉంటున్నారు, ఎవరు ప్రజల తరుపున పోరాడుతున్నారు, ఎవరు అందుబాటులో ఉంటున్నారు, అధికార పార్టీతో లాలూచి పడుతున్నది ఎవరు, ఇలా అనేక విషయాల పైన చర్చిస్తున్నారు. మొక్కుబడిగా పార్టీలో ఉండే నేతలను పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యంగా ఈ సారి యువతను రంగంలోకి దింపటానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గ్రూపులు పెట్టే వారిని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం కోసం, సర్వే టీమ్స్ ని రంగంలోకి దించారు. వాళ్ళు ఇచ్చే సమాచారం ప్రకారం, అందరితో మరోసారి చర్చలు జరిపి, ఇంచార్జ్ ల పై నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ సీరియస్ గా చేస్తున్న ఈ కార్యక్రమం పై, నేతలకు టెన్షన్ మొదలైంది. తమ భవిత ఏమిటి, సర్వే రిపోర్ట్ లో ఏముంది అనే దాని పైన ఇప్పుడు వాళ్ళకు టెన్షన్ పట్టుకుంది. మొత్తం మీద చంద్రబాబు ఒక మంచి పని చేస్తున్నారని, క్యాడర్ అంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read