టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా కోసం ఆ పార్టీ కేడర్‌ ఉత్కంఠతగా ఎదురుచూస్తోంది. కడప, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో అభ్యర్థులపై ఇప్పటికే స్ఫష్టత ఇచ్చారు. ఈ వారంలో బయటకు ప్రకటించకపోయినా జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అభ్యర్థులకు స్పష్టత ఇవ్వనున్నారు. దీని కోసం అధినేత ఉండవల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో లోకసభ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించిన బాపట్ల తొలి రౌండ్‌ పూర్తయింది. మూడు రోజుల క్రితం చంద్రబాబును కలిసి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు అరుణకుమారి తమ లోకసభ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సీట్లలో సిట్టింగులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు బలహీనంగా ఉన్నారని, వారిస్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

108 26112018 3

దీంతోపాటు కొన్ని నియోజకవర్గాలపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. మార్పులు చేర్పులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దీంతోపాటు అధినేత వరుసగా లోకసభ నియోజకవర్గాల వారీగా జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహిస్తుండడంతో సర్వత్రా టెన్షన్‌ నెలకొంది. అధినేత చేతిలో జాతకాలు.. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే నాలుగు నుంచి ఐదు సర్వేలను అధిష్టానం నిర్వహించింది. దీంతో పాటు ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై వివరాలు సేకరించారు. దీంతో పాటు సీఎం నిఘా వర్గాల ద్వారా అందరి జాతకాలను తెప్పించారు. వాటి అధారంగా టిక్కెట్ల ఎంపిక ఉంటుందని, దీంతో కొందరు నేతల్లో టెన్షన్‌ నెలకొంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగులకు వ్యతిరేకంగా అధికార పార్టీలోని మరోవర్గం కూడా నిరసన గళాలు విప్పుతోంది.

108 26112018 3

మరికొంత మంది గ్రూపు మీటింగులు పెట్టి వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అభ్యర్థిని మార్చకపోతే ఓటమి తప్పదంటూ సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వైపు కొన్ని పార్టీలతో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని సంకేతాలనూ వదులుతున్నారు. దీంతో సిట్టింగులకు స్థానచలనం ఉండొచ్చని పరోక్ష హెచ్చరికలు అందుతున్నాయి. దీంతో అతికొద్ది మందికి మినహా ఎవరికీ సీటుపై స్పష్టత రాలేదు. ఏం జరుగుతుందో తెలియక అనుచరులు కూడా డైలమాలో పడుతున్నారు. మరికొంత మంది తమ వారసులను పరిశీలించాలంటూ అనుచరుల ద్వారా సంకేతాలు పంపుతున్నారు. వారసులను వెంట పెట్టుకుని వెళ్లి అధినేతను కలిసి నేరుగా బయోడేటాలను అదిస్తున్నారని సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read