పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కో-వి-డ్ ఉద్ధృతి దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయించారు. విద్యార్థుల తరపున న్యాయపోరాటం చేస్తున్నాం అని, పరీక్షలు వద్దు, ప్రాణాలే ముద్దు అని తల్లిదండ్రులు చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. గత పది రోజులుగా, నారా లోకేష్ ఈ సమస్య పై ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. వరుస పెట్టి, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మీటింగ్ లు పెట్టారు. అయినా ప్రభుత్వం దిగి రాక పోవటంతో, న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఇక ఇదే విషయం పై, ఈ రోజు ఉదయం టిడిపి అధినేత చంద్రబాబు కూడా మాట్లాడారు., "విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రికి ప్రాణాలు తీసే హక్కు లేదు. బలవంతంగా పరీక్షలు పెట్టే హక్కు లేదు. జరగబోయే పరిణామాలన్నింటికి వారిదే బాధ్యత. పరీక్షల నిర్వహణ వల్ల ఎవరూ చ-ని-పో-ర-ని, క-రో-నా ఎవరికీ సోకదని రాసివ్వగలరా? పరీక్షల నిర్వహణ సరికాదు. వైరస్ ను కంట్రోల్ చేసి పరీక్షలు పెట్టమనండి. బెడ్లు కూడా దొరికే పరిస్థితి లేదు. అందరూ వద్దన్నారు కాబట్టి పరీక్షలు పెడుతున్నారు. వితండవాదంతో రాష్ట్రాన్ని తగులబెడుతున్నారు. 20 రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు లేదా వాయిదా వేశారు."
"కేంద్రం కూడా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను రద్దు చేశారు. అందరికంటే వీరు మేథావులా? నాడు-నేడుతో వ్యవస్థలను విధ్వంసం చేశారు. స్కూల్స్ ఓపెన్ చేసి దాదాపు 130 మంది ఉపాధ్యాయులు చ-ని-పో-యేం-దు-కు ఈ ప్రభుత్వం కారణమైంది. పిల్లలు సైతం క-రో-నా భారిన పడి వాళ్లు ఇంటిలో ఉన్నా పెద్దలపై కూడా ప్రభావం పడేలా ఈ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుంది. కేంద్రప్రభుత్వ సంస్థలన్నీ పరిక్షలను వాయిదా వేస్తే ఇక్కడ మాత్రం 10 వ తరగతి, ఇంటర్ పరిక్షలను పెడుతామంటున్నారు. విధ్యార్ధుల ప్రాణాలకు ఈ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా? ఈ ప్రభుత్వ చేతగానితనంతో, అసమర్ద నిర్ణయాలతో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు. అన్ని రాజకీయ పార్టీలు, విధ్యార్ధులు, తల్లిదండ్రలు పరిక్షలను వాయిదా వేయాలని కోరుతుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత మొండితనం? ప్రాణం ఉంటేనే చదువులు, ప్రాణం ఉంటేనే పరిక్షలు. ప్రాణం లేకపోతే ఎవరికి చదువులు చెబుతారు? ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. " అని చంద్రబాబు అన్నారు.