రాష్ట్రఎన్నికలకమిషన్,స్థానికఎన్నికలునిర్వహించాలనుకున్నప్పటినుంచీ రాష్ట్రప్రభుత్వం తప్పటడుగులు, తప్పుటడుగులు వేస్తోందని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యలు వర్లరామయ్య స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం .... "ఎన్నోతప్పులుచేస్తున్నాం..ఇదొక తప్పన్నట్లుగా ప్రభు త్వం వ్యవహరిస్తోంది. మార్చి31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్రఎన్నికలకమిషనర్ బాధ్యతలనుంచి వెళ్లి పోగానే, అప్పటివరకు జగన్మోహన్ రెడ్డి వద్ద చీఫ్ సెక్రట రీగా పనిచేసినవ్యక్తి, ఆయన మాటలను తూచా తప్పకుండా అమలుచేసిన నీలంసాహ్ని ఎన్నికల కమిషనర్ గా నియమింపబడ్డారు. ఏప్రియల్ 1న అధి కారులంతా ఆమెనుకలిసి అభినందించారని, ఆమెవెళ్లి గవర్నర్ ని కలిసి వచ్చాక, తాను ఆమెను కలవడానికి వెళ్లడం జరిగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నప్పు డు ఏవిధంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయో, ఎంతటి అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా నిర్వహించారో ఆమెకు వివరించడానికి వెళ్లాను. పరిషత్ ఎన్నికలకు తాజా నో టిఫికేషన్ఇవ్వమని ఆమెకునచ్చచెప్పడానికి తాను వెళ్లాను. రుజువులతో సహా ఎన్నికలు ఎలా జరిగాయో, ఏవిధంగా బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయో తెలియ చేశాను. తప్పకుండా న్యాయనిపుణులతో సంప్రదించి, చర్యలు తీసుకుంటానని ఆమె నాతో చెప్పారు. అదే సమయంలో ఎన్నికలనిర్వహణపై అన్నిపార్టీల సమావే శం నిర్వహిస్తున్నట్లు ఆమెనాతో చెప్పారు. ఆమెకు ధన్యవాదాలు తెలియచేసి నేను తిరిగొచ్చాను. సాయంత్రం 7గంటలకు జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు అనిచెప్పి నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఆమె ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి 12గంటలు కూడా కలవకుండానే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నిపా ర్టీల సమావేశం పెడతామనిచెప్పి, న్యాయనిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాననిచెప్పినఆమె, అంత దుర్మార్గంగా వ్యవహిరిస్తుందని తాము అనుకోలేదు. ఆమె నిర్ణయంపై వెంటనే హైకోర్టుని ఆశ్రయించాము."
"సుప్రీంకోర్టు ఆదేశాలప్రకారం నాలుగువారాలు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుచేశాకే, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఉందని, దాన్నికాదని ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చారని తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. నోటిఫికేషన్ రద్దుచేయాలని, తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని నేనే హైకోర్టులో పిటిషన్ వేశాను. ఆ వ్యవహారంపై నిన్న హైకోర్ట్ జడ్జి ఆదేశాలిచ్చారు. సుప్రీంఆదేశాలు పాటించా లని, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జర పాలని చెప్పి ఎన్నికలనిర్వహణపైస్టే విధించారు. హైకోర్ట్ స్టే ఇవ్వగానే వెంటనే ఎన్నికలు ఆపి, కోడ్ ఆప్ కాండక్ట్ ప్రకారం తప్పులు సరిదిద్దుకొని నాలుగువారాల తరువాత నోటిఫికేషన్ ఇవ్వాలి. తాజా నోటిఫికేషన్ ఇస్తా రా...లేక కొనసాగిస్తారా అనేదిఆలోచించాలి. నిన్నటి హైకోర్ట్ తీర్పుచూశాక ముఖ్యమంత్రి గంగవెర్రులెత్తిపో యాడు. ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుబట్టాడు. హై కోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీలు చేస్తే, నేడుఎన్నికలుపెట్టుకోవచ్చని తీర్పు వచ్చింది. ఎన్నికలు నిర్వహించండి గానీ, ఫలితాలు ప్ర కటించవద్దంటూ మెలిక పెట్టారు. సుప్రీంకోర్టు నిబంధన లను హైకోర్ట్ డివిజన్ బెంచ్ విస్మరించిందని తాము భా వించాము. అప్రజాస్వామికంగా ప్రభుత్వం వెళుతుంది, ప్రభుత్వం వేసే చిటెకలకు అనుగుణంగా ఎస్ఈసీ నడు స్తుంది అంటే తాము చూస్తూఊరుకునేది లేదు. చట్టా న్ని అమలుచేసి, చట్టబద్ధంగా ముందుకువెళ్లాలని తా ము నిర్ణయించుకున్నాము. సుప్రీంకోర్టు ఆదేశాలు రా ష్ట్రంలో అమలుకావడంలేదని చెబుతూ, తాము ఈ వ్యవహారంపై సుప్రీం తలుపుతట్టాలని నిర్ణయించాము."
"టీడీపీఅధినేత చంద్రబాబు మాపార్టీ నేతలందరితో మాట్లాడారు. న్యాయపరంగా తీసుకోవాల్సిన అభిప్రాయాలు తాము తీసుకున్నాము. స్థానికసంస్థల కు రాష్ట్రంలో అరాచకంగా ఎన్నికలు జరగబోతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో 85పంచాయతీలు ఉంటే మొత్తం ఏకగ్రీవమవుతాయా? మహాత్మాగాంధీ కంటే గొప్పవాడా పెద్దిరెడ్డి. రాజకీయసేవలో పుచ్చల పల్లి సుందరయ్య, వావిలాల కంటే ఘనాపాఠా అతను. అవినీతికి నిలువెత్తురూపం అతను. అతని నియోజకవ ర్గంలో అన్నిస్థానాలుఏకగ్రీవాలు అయ్యాయంటే ఎన్నిక లకమిషన్ఎంతటి నిస్తేజ స్థితిలో ఉందో అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అరాచక అప్రజాస్వామిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో పోరాడాలని నిర్ణయించాము. రాజ్యాంగవ్యతిరేక విధానాలతో నడుస్తు న్న ఎన్నికలను అడ్డుకొని తీరుతాము. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ప్రభుత్వం వాడుకుంటున్న విధానాన్ని కూడా సుప్రీందృష్టికి తీసుకెళ్లబోతున్నాము. గతంలో సుప్రీంకోర్టు తెలిపిన నిబంధనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవాలని తాము దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని కోరబోతున్నాము. అరాచకత్వానికి తలవంచే దిలేదు. దుర్మార్గాన్ని ఒప్పుకునేది లేదు. న్యాయం జరిగేవరకు, రాజ్యాంగాన్ని కాపాడేవరకు టీడీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేస్తున్నాము. ఎన్ని కల బహిష్కరణ నిర్ణయం నిర్ణయమే. ఆ నిర్ణయం ఎం దుకు తీసుకోవాలో స్పష్టంగా చెప్పాము. హైకోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పుపై తాము సంతోషంగా లేము. సుప్రీం నిబంధనలను హైకోర్టు విస్మరించిందని తాము భావిస్తున్నాము. అరాచకప్రభుత్వంపై న్యాయం, ధర్మం కాపాడబడేవరకు, ప్రజాస్వామ్యం కాపాడబడేవరకు తెలుగుదేశం పోరాడుతుంది."