ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. అధికారం, ఎటు వైపు అంటూ, అటు వైపు జంప్ అయ్యే, జంప్ జిలానీలు, రాజకీయాల్లో ఎక్కువ అయిపోయారు. మన రాష్ట్రంలో అయితే, మరీ సిగ్గు లేకుండా దూకేస్తున్నారు. అమ్మనా బూతులు తిట్టిన నోటితోనే, నాకు దారి చూపించిన దేవుడు అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. చంద్రబాబు లాంటి విజనరీ లేరు అని పొగిడిన నోటితోనే, అమ్మలు, అక్కలు, బాబులు దాకా వెళ్లి తిట్టేస్తున్నారు. ఇలా ఉంది ఆ పార్టీ నుంచి, ఈ పార్టీలోకి జంప్ చేసే వారి పరిస్థితి. నేను చనిపోతే, తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకునే చనిపోతానని అని ఒకరు, అన్నం తినే వాడు ఎవరూ ఆ పార్టీలో చేరరు అని చెప్పే వారు ఒక వైపు. ఇంత నమ్మకంగా పార్టీ మారము అని చెప్పిన, రెండో రోజే పార్టీ మారిపోవటంతో, అటు పార్టీ అధిష్టానానికి కాని, ఇటు కార్యకర్తలకు కాని, వారి అనుచరులకు కాని, ఏమి అర్ధం కావటం లేదు. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వారి పై వ్యూహం మార్చింది.

tdp 02122019 2

దీనికి ఉదాహరణగా, ఇటీవల జరిగిన సంఘటనలు చెప్తున్నారు. ఇటీవల పార్టీ మారిన దేవినేని అవినాష్ గురించి ప్రస్తావిస్తూ, పార్టీ మారే నాలుగు రోజుల ముందు కూడా, యువ నేతలు అందరూ, చంద్రబాబుతో కలిసి భోజనం చేసారని, ఆ సందర్భంలో కూడా, తాను పార్టీ మారుతున్నా అని చెప్పిన వ్యాఖ్యలు అవినాష్ ఖండించారని చెప్తున్నారు. భోజనం పెట్టి, మంచీ చెడు మాట్లాడిన సమయంలో కూడా, ఏమి చెప్పని అవినాష్, చివరకు పార్టీ మారిపోయారని అంటున్నారు. అలాగే వంశీ కోసం, కేశినేని నాని, కొనకళ్ళ నారయణను కూడా పంపించి, వంశీ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా, చివరకు వంశీ, తీవ్ర విమర్శలు చేసి మరీ పార్టీ మారారు. ఇలా పార్టీ మారే వారిని, ఎంత బుజ్జగిస్తున్నా, వాళ్ళు మాత్రం, చివరకు చంద్రబాబుని కూడా తిట్టి వెళ్ళిపోతున్నారు.

tdp 02122019 3

దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం, ఇలా పార్టీ మారే విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చారని తెలుస్తుంది. ఇకముందు టీడీపీని వీడేవారెవర్నీ కూడా బతిమిలాడకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారట. తెలుగుదేశం సిద్ధాంతాలు, కట్టుబాట్లు, నాయకత్వంపై నమ్మకం ఉన్నవారే పార్టీలో కొనసాగుతారనీ, తెలుగుదేశం పార్టీకి ఇటువంటి సంక్షోభాలు కొత్తేమీ కాదనీ పలువురు నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచాకాన్ని తట్టుకుని మరీ, తెలుగుదేశం ద్వితీయశ్రేణి నాయకులు, పార్టీని వీడకుండా ఉన్నారని, అలాంటి వారే పార్టీకి స్పూర్తి అని, ఇలా పార్టీ మారే వారి గురించి, అసలు ఆలోచించే పనే లేదని, పోయే వాళ్ళు పోతారని, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read