9117 ఎంపీటీసీలు, 639జడ్పీటీసీలు, 302 నగర పంచాయతీలు, 557 కార్పొరేషన్లు, 1631 మునిసిపాలిటీల్లో మొత్తం కలిపి 12,336 నామినేషన్లు టీడీపీ తరుపున రాష్ట్రవ్యాప్తంగా వేయడం జరిగిందని, టీడీపీనేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్నిరకాలుగా టీడీపీని అడ్డుకోవడానికి, ఎన్నికల్లో నిలవకుండా చేయడానికి అధికారపార్టీ చేయాల్సిన దా-రు-ణా-లు, దా-ష్టీ-కా-లు చేసిందని, అయినాకూడా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ప్రతిపక్షపార్టీ స్థానిక ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేలా బరిలో నిలవడం జరిగిందన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, కుల, నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఎన్నికల అధికారులను, పోలీసులను అడ్డంపెట్టుకొని, వివిధ రకాలుగా బెదిరించి ఎంపీటీసీల్లో 166మందిని, మునిసిపాలిటీల్లో 40మందిని అడ్డుకోవడం జరిగిందన్నారు. నామినేషన్లు ఫైల్ అయ్యాక టీడీపీకిచెందిన 18 మంది ముఖ్యనేతలపై బైం-డో-వ-ర్ కే-సు-లు పెట్టారని, వాటిలో తప్పుడు కే-సు-లు 2 నమోదైతే, కి-డ్నా-ప్ కే-సు-లు 9 నమోదయ్యాయని, నామినేషన్లు లాక్కోవడం, చించేయడం వంటి సంఘటనలు 24 చోట్ల జరిగాయన్నారు. అన్నింటికన్నా ఎక్కువ 87చోట్ల పోలీసులు, 84చోట్ల వైసీపీవారు, తమపార్టీకి చెందిన వారిని బెదిరించడం, కొ-ట్ట-డం వంటి సంఘటనలు జరిగాయన్నారు. ఇవన్నీ కలిపితే 224 సంఘటనల వరకు పోలీసులను అడ్డుపెట్టుకొని చేసిన దా-డు-లే ఉన్నాయన్నారు.
ఇవి పూర్తయ్యాక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో తప్పులు చూపించి 220వరకు (ఎంపీటీసీ, జడ్పీటీసీలు కలిపి) నామినేషన్లు తిరస్కరించడం జరిగిందన్నారు. ఈ పనికూడా ఎన్నికల విధుల్లో ఉన్నవారిని అడ్డుపెట్టుకొని, అన్యాయంగా, అక్రమంగా చేసిందేనని దీపక్ రెడ్డి తెలిపారు. తరువాత టీడీపీ అభ్యర్థులను భయపెట్టి, కొ-ట్టి, ఇతరేతర మార్గాల్లో ప్రలోభపెట్టి, డబ్బు ఎరచూపి, తప్పుడుకేసులు పెట్టి 498 ఎంపీటీసీ, 72 జడ్పీటీసీ నామినేషన్లను వెనక్కు తీసుకొనేలా చేయడం జరిగిందన్నారు. 83 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీని వైసీపీ ఇప్పటికే ఏకగ్రీవం చేసుకుందని, ఎన్నిరకాలుగా పోలీసులను, ఎన్నికల అధికారులను ఉపయోగించుకొని చివరకు వైసీపీ సాధించింది మొత్తం 84స్థానాలేనన్నారు. డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ కే-సు-ల-కు సంబంధించి చెప్పిన లెక్కలన్నీ తప్పుడు లెక్కలేనని, కేవలం తెలుగుదేశంపార్టీ వారిపై పెట్టిన అ-క్ర-మ కే-సు-ల వివరాలు మాత్రమే ఆయన వెల్లడించారన్నారు. తమపార్టీ తరుపున ఇచ్చిన ఫిర్యాదులపై డీజీపీగానీ, ఇతర పోలీస్ అధికారులు గానీ ఏవిధమైన చర్యలు తీసుకోలేదని, ఆయన చెప్పిన వివరాలతోనే తేలిపోయిందన్నారు. ఎన్నికల కమిషన్ కు ఇప్పటివరకు అన్నిరకాల ఆధారాలతో సహా, ఏంజరిగిందో ఫిర్యాదుచేసినప్పటికీ వాటిపై ఏవిధమైన చర్యలు లేవన్నారు.
తామిచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఏరకమైన వివరణ రాలేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేకపోతే, ఆ ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల కమిషన్ కైనా పంపాలని దీపక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వైసీపీప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఎన్నికల్లో గెలవడంకోసం నేరాలకు పాల్పడిందని, ప్రభుత్వయంత్రాంగాని నిర్వీర్యంచేసేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ప్రజల కష్టార్జితం నుంచి, వారు కట్టే పన్నుల నుంచే తమకు జీతాలు వస్తున్నాయన్న విషయాన్ని, ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు, పోలీసులు గుర్తుంచుకోవాలని, వారంతా ఏఒక్క పార్టీకో కొమ్ముకాయకుండా ప్రజల పక్షాన నిలవాలని దీపక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలను వే-ధిం-పు-ల-కు గురిచేస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రతి ఉద్యోగిని, ప్రతి పోలీస్ అధికారిని కోర్టులముందు నిలిపేవరకు టీడీపీ వదిలిపెట్టదని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. నేతలు చెప్పారని ఒత్తిడికి తలొగ్గే వారంతా, డీజీపీ మాదిరే కోర్టు ముందునుంచోవాల్సి వస్తుందని, జైలుకుపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల బరిలోనిలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు ధైర్యంగా ఉండాలని, ప్రజలంతా టీడీపీకి అండగా నిలవబోతున్నారని, అదేమనకు కొండంత అండనిస్తుందని ఆయన స్పష్టంచేశారు.