రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ వ్యవహరిస్తున్న తీరు పై, అధికార టీడీపీ తీవ్ర అసంతృప్తిలో ఉంది... మొన్నటి దాక చూసి చూడనట్టు వదిలేసినా, నిన్న చంద్రబాబ ఆహార పదార్థాలు తీసుకెళ్లే వాహనాన్ని వైసిపి నిఘా పెట్టటం, డబ్బు ఉందని, విష ప్రచారం చెయ్యటం, వెంటనే ఎన్నికల అధికారులు, జడ్ ప్లస్ భద్రత కలిగిన సి.యం ప్యాంట్రీ వ్యాన్ ని అనుమతి లేకుండా, తాళాలు పగలగొట్టటం, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు ఇంటలిజెన్స్ కూడా తీవ్రంగా పరిగనిస్తుంది..
వైసిపి నాయకులు పాంట్రీ కార్ ని తనిఖీ చెయ్యటమేంటి ??? దానికి ఈసీ అధికారులు ఒప్పుకోవటం ఏంటి ?? రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎందుకింత ఉత్సాహం చూపిస్తుంది ? జగన్ మీద ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా ఇంత వేగంగా ఈసి స్పందించడం లేదన్నది టీడీపీ నేతల అభిప్రాయం... చంద్రబాబును చంపేసినా తప్పు లేదు అని జగన్ అనటం, దాని మీద తెదేపా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జగన్ కి ఇచ్చిన నోటిసుకు అయన చెప్పిన సమాధానంతో , ఈసీ సంతృప్తి చెందిందో లేదో చెప్పలేదు అని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగానే ఆఘమేఘాల మీద స్పందిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా సీఎం వాహనాన్ని అడ్డుకున్న తీరును మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్న నేతలు ఈసి వైఖరిపై ఆటో ఇటో తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
2014లో సార్వత్రిక ఎన్నికాల్లో కూడా భన్వర్లాల్ వైసిపికి అనుకూలంగా పని చేశారు అనే వాదనలు ఉన్నాయి. రేపో ఎల్లుండో దీనిపై ఢిల్లీలో, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.
అయినా రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్ళు అయ్యింది... అన్ని శాఖలకి విభజన జరిగింది.. కాని ఎలక్షన్ కమిషన్ రెండు రాష్ట్రాలకి ఒక్కటే... అదీ హైదరాబాద్ నుంచి పని చేస్తుంది.. దీంతో, మన రాష్ట్రానికి సొంతగా ఎన్నికల కమిషన్ ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే, హైదరాబాద్ వేదికగా, మన మీద కుట్రలు చేస్తూనే ఉంటారు...