అమరావతిలో దళితుల భూములు పై కుంభకోణం అంటూ, చంద్రబాబు పై ప్రభుత్వం సిఐడి కేసు పెట్టి, ఆయనకు జగన్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సరైన ఆధారాలు ఏమి చూపించకపోవటం, కోర్టు ఆధారాలు అడిగితే, తమ వద్ద ఇప్పుడే ఏమి లేవు అని చెప్పటంతో, హైకోర్టు ఈ కేసుని వాయిదా వేసింది. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ ఈ ఫిర్యాదు ఇవ్వటం, తనకు కొంత మంది రైతులు వచ్చి విషయం చెప్పారని, వాళ్ళ తరుపున ఫిర్యాదు చేస్తున్నాను అంటూ ఆళ్ళ తన కంప్లైంట్ లో కొంత మంది పేర్లు పెట్టారు. అయితే ఆ కంప్లైంట్ ఇచ్చిన వారి వాద్దకు వెళ్ళగా, మేము చంద్రబాబు పై కంప్లైంట్ ఇవ్వలేదు అంటూ, సంచలన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇదంతా చంద్రబాబు పై కుట్ర అని తేలిపోయింది. ఇది రాజకీయ కుట్ర అంటూ, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, సంచలన వీడియోలు బయట పెట్టింది. సీనియర్ నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, ఈ వీడియోలు చూపించారు. ఫిర్యాదు చేసిన కందా పావని అనే ఆమె స్పందిస్తూ, మేము అసలు ఏ కేసు పెట్టలేదని చెప్పారు. తమ వద్దకే విచారణ అంటూ, కొంత మంది వచ్చారని, అప్పట్లో మీరు భూమి అమ్మరా లేదా అని విచారణ చేసి, తమ వద్ద సంతకాలు పెట్టించుకుని వెళ్ళారని తెలిపారు.
ఆ సంతకాన్ని మేము కేసు పెట్టినట్టు ఇప్పుడు తిప్పెసరని చెప్పారు. మీడియాలో తమ పేర్లు వచ్చేంత వరకు ఈ విషయం తెలియదని, ఇలా ఫిర్యాదు కోసం అయితే, తాము అసలు సంతకాలే పెట్టే వాళ్ళం కాదని, తేల్చి చెప్పారు. ఇక మరో రైతు అద్దెపల్లి సాంబశివరావు కూడా ఇదే చెప్పారు. ఎవరూ తమ వద్ద బలవంతంగా లక్కోలేదని చెప్పినా, కేసు పెట్టేసారని అన్నారు. దీనికి సంబంధించి రెండు వీడియోలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది. ఇప్పటికే, జాన్సన్ అనే వ్యక్తి గురించి వివరాలు బయట పెడుతూ, ఆయన ఆళ్ళ అనుచరుడు అని తేలిపోయింది. మేము ఎక్కడ విచారణలో బలవంతంగా లాక్కున్నారని చెప్పలేదని, పోలీసులు సంతకాలు పెట్టించి, ఇప్పుడు ఇలా చేసారని అంటున్నారు. చంద్రబాబు పై కేసులు పెట్టటం, రాజధానిని తరలించే కుట్రలో భాగంగానే, ఇలా తప్పుడు ఫిర్యాదులు చేసారని, దీని వెనుక పై స్థాయిలో కుట్ర జరుగుతుంది అంటూ, తెలుగుదేశం పార్టీ వాపోతుంది. ఇవన్నీ కోర్టుకు కూడా ఇస్తాం అని, పోలీసులు పై కూడా ప్రైవేటు కేసు వేస్తామని చెప్తున్నారు.