మన రాష్ట్రానికి జరిగిన అన్ని అవమానాలకంటే, ఇది ఎంతో దారుణమైనది. డబ్బులు మన ఎకౌంటులో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని ఈ సంఘటన గురించి, చంద్రబాబు నేషనల్ మీడియాతో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెనుకబడిన జిల్లాలకు రావలసిన 350 కోట్ల నిధులు గురించి పార్లమెంట్ లో నిలదీశారు తెలుగుదేశం ఎంపీలు. కేంద్రం ఏమి సమాధానం చెప్పలేక పోవటంతో, కేంద్రం చర్యకు నిరసనగా లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్ లు మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

parliament 06082018 2

ఏపీపై కేంద్రం వివక్ష చూపడం మానుకోవాలని, 95 శాతం యూసీలు ఇచ్చినా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఫిబ్రవరి 9న వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేశారని, వారం రోజుల్లోగా పీఎంవో చెప్పిదంటూ వెనక్కి తీసుకున్నారని, ఏపీపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని, యూసీలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజ్ అమలు చేస్తామన్నారని, అది అమలు చేస్తే రూ.22 వేల కోట్లు విడుదల చేయాలని అన్నారు.

parliament 06082018 3

రెండు రోజుల క్రితం, ఈ విషయం పై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ఇచ్చిన సమాధానం కూడా అసంతృప్తిగానే ఉంది. ‘‘విభజన చట్టంలోని సెక్షన్‌ 46(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకు రూ.300 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాం. అందులో ఒక్కో జిల్లాకు ఏటా రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు మూడు వాయిదాల్లో రూ.1,050 కోట్లు విడుదల చేశాం. విభజన చట్టం కింద కొత్త రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం తరఫున చేయాల్సిన సాయంపై 2015 డిసెంబర్‌ 1న నీతి ఆయోగ్‌ ఏడు వెనుకబడిన జిల్లాలకు ఒక్కో దానికి రూ.300 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల మొత్తాన్ని సిఫార్సు చేసింది. అందులోనే అంతకుముందు రెండేళ్లలో విడుదల చేసిన రూ.700 కోట్లు కూడా ఇమిడి ఉంది. వినియోగ పత్రాలను(యూసీ) నీతి ఆయోగ్‌ తనిఖీచేసిన తర్వాత, సంబంధిత అధికార యంత్రాంగం ఆమోదముద్ర వేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులు విడుదల చేస్తూ వస్తున్నాం. తాజా అంశంలో అవసరమైన అన్ని రకాల అనుమతులు లభించలేదు. అందువల్లే అనుకోకుండా రూ.350 కోట్లు విడుదల చేసి వెనక్కు తీసుకున్నాం. ఇంకా ఆ నిధుల విడుదల జరగ లేదు’’ అని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఎవరు ఆ అనుమతులు ఇవ్వలేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే, ఇప్పటికీ నీతి ఆయోగ్, దీనికి సంబంధించిన అన్ని రకాల యుసీలు ఆమోదించింది. మరి, ఎవరి అనుమతి ఇవ్వలేదు అనే విషయం మాత్రం స్పష్టం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read