మొన్నా మధ్య ఒకాయిన కాకినాడ వచ్చి, మాది పది జిల్లాల పార్టీ కాదు, జాతీయ పార్టీ, మీరెంత అని మన రాష్ట్ర పార్టీల గురించి అన్నాడు... పాపం ఆయన గారు మర్చిపోయారు అనుకుంటా, ఆయన పార్టీకి 2 ఎంపి సీట్లు ఉన్నప్పుడు, మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ, అన్న గారి తెలుగువారి ఆత్మాభిమాన నినాదంతో ఢిల్లీని ఎదుర్కుని, 1984 నుంచి 1989 మధ్య పార్లమెంట్ లో ప్రతి పక్షంగా ఉంది... అది మా తెలుగువారి చరిత్ర... ఈయన గారికి ఇప్పుడు నెత్తికి ఎక్కి, మీది పది జిల్లాల పార్టీ అని అవహేళన చేసి వెళ్ళాడు... ఆయన్ను చూసుకుని, ఇప్పుడు ఇంకొకడు బయలుదేరాడు... మా పార్టీ లేకపోతే, మీకు డిపాజిట్ కూడా రాదు, మీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వలేడు అని వార్నింగ్ ఇచ్చాడు... ఆ కధ ఏంటో చూద్దాం...
బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని ఆ పార్టీ జాతీయ నేత చల్లపల్లి నరసింహా రెడ్డి అన్నారు. 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీకి 17 చోట్ల డిపాజిట్లు దక్కలేదని ఆయన గుర్తు చేసారు. 2014లో తమతో పొత్తు ఉంది కాబట్టే చంద్రబాబు గెలిచారు అన్నారు. అదే విధంగా తాము 2019లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.
సార్ గారు చెపుతున్న ప్రకారం టీడీపీకి డిపాజిట్లు రావు, ఇటు పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఉండదు, అంటే వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్రభంజనమే అనే ఆయన చెప్తున్నారు... ఆయన చెప్తున్న ప్రకారం ఇక రాష్ట్రంలో బీజేపీ, వైకాపా మాత్రమే ఉంటాయి... 175 నియోజకవర్గాల్లో, 2014లో చంద్రబాబు వీరికి 15 సీట్లు ఇచ్చారు... చివరకు వీరు గెలిచింది 4... వీళ్ళు కూడా డిపాజిట్లు గురించి మాట్లాడుతున్నారు అంటే, మన ఖర్మ అనుకోవటమే... ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంది రాష్ట్ర ప్రయోజనాలు కోసం, అంతే కాని చంద్రబాబుకి డిపాజిట్ రావటానికి కాదు... సార్ గారిని నిద్ర లేపరా సాంబా, కలలు ఎక్కువ కంటున్నారు..