2019 సార్వత్రిక ఎన్నికల్లో, జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో, వైసీపీ పార్టీ, 151 సీట్లు సాధించి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంత పెద్ద భారీ విజయం చూసి, తెలుగుదేశం శ్రేణులు నీరసం అయిపోయాయి. మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడ్డారు. కాని గడిచిన ఆరు నెలల్లో, ప్రతి అంశంలోను, జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ అవుతూ ఉండటంతో, తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఇబ్బంది లేకుండానే, పుంజుకునే అవకాసం వచ్చింది. ఇసుక అందుబాటులో ఉంచటంలో, జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ అవ్వటంతో, అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారు. బ్రతకటమే, కష్టం అయ్యే పరిస్థితి వచ్చింది. మరో పక్క అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయింది. సంక్షేమం అరకొరగా సాగుతుంది. ఆర్ధిక పరిస్థితి, రోజు రోజుకీ దిగజారి పోతుంది. ఒక్క పెట్టుబడి రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. కేంద్ర సహకారం కూడా అంతఅంత మాత్రం గానే ఉంది. ఈ పరిస్థితులు అన్నీ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, పై వ్యతిరేకత తెచ్చి పెట్టాయి.

tdp 01122019 2

ఇలాంటి సమయంలో, జనవరిలో స్థానిక సమరానికి వెళ్ళే ముందు, తెలుగుదేశం పార్టీకి, ఈ లోపే ఒక బూస్ట్ ఇచ్చే న్యూస్ వినిపించింది. ఇతీవిల జరిగిన ఒక మత్స్యకార సొసైటీ ఎన్నికలో, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మత్స్యకారుల వేట విరామ సమయంలో పరిహారం పెంపు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే వారి కుటుంబానికి రూ.10 లక్షల వంటి వరాలనూ ప్రభుత్వం ప్రకటించినా, ఒక మత్స్యకార సొసైటీ ఎన్నికలో టీడీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఈనెల 21న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని కాట్రావులపల్లి మత్స్యకార సొసైటీ ఎన్నిక జరిగింది. మొత్తం 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాలి. నిజానికి... ఇది పార్టీ గుర్తుతో జరిగే ఎన్నిక కాదు. అయినప్పటికీ... వైసీపీ, టీడీపీ నేతలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ పార్టీల మద్దతుదారులే రంగంలోకి దిగారు. బ్యాలెట్ పేపర్ విధానంలో సీక్రెట్ ఓటింగ్ నిర్వహించారు. 389 ఓట్లకుగాను 359 పోలయ్యాయి.

tdp 01122019 3

టీడీపీ మద్దతుదారులు ఆరు స్థానాలు దక్కించుకున్నారు. వైసీపీ మద్దతుదారులకు రెండు మాత్రమే దక్కాయి. మరో డైరెక్టర్ స్థానం ఫలితం టై అయింది. దీంతో ఎన్నికల అధికారి ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిర్చి బొమ్మా బొరుసు వేశారు. అందులోనూ టీడీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. దీంతో 9 డైరెక్టర్ స్థానాల్లో ఏడింటిని టీడీపీ గెలుచుకున్నట్లయింది. ప్రభుత్వం మత్స్యకారులకు ప్రకటించిన వరాలు తమ విజయానికి దోహదపడలేని వైసీపీ మద్దతుదారులు నిట్టూర్చారు. మత్స్యకారులు ఇప్పటికీ తమవైపే ఉన్నారని, ప్రభుత్వంపై సామాన్యుల్లో వ్యతిరేకతకు ఈ ఎన్నిక నిదర్శనమని టీడీపీ స్థానిక నేతలు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పోరుకు ఇది టానిక్ లాంటిదని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read