ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ అధికారులతో పాటుగా, జిల్లా విద్యా శాఖ అధికారులు విచిత్రమైన సర్క్యులర్లు, ఆదేశాలు ఇస్తున్నారు. రేపు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా, స్కూల్స్ లో ఉండే హెడ్ మాస్టర్లు, టీచర్లు, తల్లిదండ్రుల కమిటీకి చెందిన వారు, వీరందరూ రేపు స్కూల్స్ కి రావాలని, అక్కడ టాయిలెట్లను వీరంతా పరిశుభ్రంగా కడగాలని, ఆదేశాలు జారే చేసారు. ఈ టాయిలేట్లు కడిగే కార్యక్రమంలో అందరూ పాల్గునాలని కూడా విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు అనంతపురంలో, విద్యా శాఖ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ బయటకు వచ్చింది. దీంతో పాటు రాష్ట్ర విద్యా శాఖ నుంచి కూడా వాట్స్ ఆప్ లో సందేశాలు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు కూడా వెళ్లాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. విద్యా శాఖ జారీ చేసిన ఈ సర్క్యులర్ పై తీవ్ర చర్చ జరుగుతుంది. రేపు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా, అందరికీ ఆప్షనల్ హాలిడే ఉందని, కార్తిక పౌర్ణమిని అందరూ శ్రద్ధతో జరుపుకుంటారని, ఈ తరుణంలో వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా, టీచర్లు అందరూ టాయిలెట్లు కడగాలని, ఈ సర్క్యులర్లు పంపించటం ఏమిటి అంటూ, విద్యా శాఖ లో ఉండే అధికారులు, టీచర్లు, హెడ్ మాస్టర్లు వీరందరూ కూడా ప్రభుత్వ జారీ చేసిన ఈ ఆదేశాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యా సంఘాలు అయితే మాత్రం, ఈ పరిణామం పై మండి పడుతున్నాయి. ఆప్షనల్ హాలిడేని, టాయిలెట్లు కడగటం కోసం టీచర్లను, రమ్మనటం, అదీ కాక రేపు కార్తీక పౌర్ణమి అని కూడా గుర్తు చేస్తున్నారు. ఏపిటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ ఆదేశాల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏదైతే విద్యా శాఖ పంపించిన వాట్స్ అప్ సందేశం కానీ, దాంతో పాటుగా, ఇచ్చిన జిల్లా విద్యా శాఖ అధికారులు ఇచ్చిన సర్క్యులర్లు కానీ, ఇవి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ విధంగా సర్క్యులర్లు ఇస్తూ, బడులలో ఉండే టీచర్లను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, ఉపాధ్యాయులు టాయిలెట్లు కడిగే కార్యక్రమం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మరుగుదొడ్లు రోజు ఫోటోలు తీసి యాప్ లో పెట్టాలి అనే నిబంధనతో టీచర్లు ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు ఏకంగా దొడ్లు కడగాలని చెప్పటంతో, టీచర్లు అవాక్కయ్యారు. మరి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెనక్కు తీసుకుంటుందో లేదో మరి.