పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు గుర్తున్నాయా ? చంద్రబాబుకి 2.5 మార్కులు, కెసిఆర్ కు 6 మార్కులు ఇచ్చి, కెసిఆర్ పరిపాలన ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.. ఇక పవన్ కొత్త స్నేహితుడు, వైసిపీ దగ్గరకు వద్దాం.. నిన్న విజయసాయి రెడ్డి, అంతకు ముందు జగన్, ఇద్దరూ ఏమన్నారో గుర్తుందా ? చంద్రబాబు, కెసిఆర్ ని చూసి పరిపాలన ఎలా చెయ్యాలో నేర్చుకోవాలి అంట... వీళ్ళద్దరి మాట విని, ప్రజలు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే, ఎందులో చూసినా చంద్రబాబు, కెసిఆర్ కంటే వంద రెట్లు నయం... అసలు కెసిఆర్ సచివాలయనికే వెళ్ళాడు, అలాంటి వాడితో చంద్రబాబుకి పోలిక ఏంటి అని... అయితే, అటు పవన్ కు, ఇటు వైసిపీకి, అదిరిపోయే జెర్క్ ఇచ్చింది కాగ్...

jagan 29032018

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని కాగ్ పేర్కొంది. రెవెన్యూ లోటు 5 వేల కోట్లు ఉన్నట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. అప్పు తెచ్చుకున్న నిధులను రెవెన్యూ రాబడిగా చూపించి ద్రవ్యలోటును రూ.2500 కోట్లు తక్కువగా చూపించారని తెలిపింది. వాల్టా చట్టం నిబంధనలు పాటించడంలో ప్రభుత్వం విఫలమందని నివేదికలో కాగ్ పేర్కొంది. వివిధ పథకాల కోసం డ్రా చేసిన నిధులకు యూసీ సమర్పించలేదని, కొన్ని చోట్ల నిధులు రాకుండానే యూసీలు సమర్పించారని మండిపడింది. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలుతో రూ.5,820 కోట్ల భారం పడిందని తెలిపింది.

jagan 29032018

టీ హబ్ రెండో దశ భవన నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వంపై రూ. 16.70 కోట్ల ఆర్థిక భారం పడిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. ఇసుక కొనుగోలులో రూ.18 కోట్ల అనుచిత లబ్ది చేకూర్చారని ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. ఇందిరమ్మ వరద కాలువకు రూ.4711 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితం రాలేదని కాగ్ తన నివేదికలో తెలియజేసింది. ప్రాధాన్యత లేని పనులను మొదటి రెండు దశల్లో మొదలు పెట్టారని..కేంద్రం ఇచ్చిన నిధుల్లో 50శాతం కూడా ఖర్చు చెయ్యలేదని ఆక్షేపించింది. దళితులకు మూడెకరాల భూమి గుర్తింపులో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు కావడం లేదని, కాగ్ తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణాలో ఇంత జరుగుతున్నా, కెసిఆర్ ని ఆహా, ఓహో అంటూ పొగుడుతారు, చంద్రబాబుని తిడతారు... ఎందుకంటే, వీళ్ళు ఉండేది హైదరాబాద్ లో కాబట్టి... కెసిఆర్ తోక జాడిస్తే, ఏమి చేస్తాడో తెలుసు కాబట్టి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read