దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నాయి... ఈ రోజు, కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు... తమ హక్కుల కాపాడుకొనే దిశగా సౌత్ స్టేట్స్ ఏకమవుతున్నాయి. దక్షిణాది నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం వస్తున్నా… నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ సమావేశానికి రావటం లేదు అంటూ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మంత్రులు కబురు పంపించారు... ఎందుకు రావటం లేదో సరైన కారణం చెప్పటం లేదు... ఈ నిర్ణయంతో, వీరు మోడీ తొత్తులు అనేది మరోసారి స్పష్టం అయ్యింది...

modi 10042018

మొన్న పార్లమెంట్ సమావేశాలు అప్పుడు కూడా, ఈ రెండు పార్టీలే గోల చేసి, అవిశ్వాస తీర్మానం రాకుండా అడ్డు పడ్డాయి... చివరి వారం రోజులు తెరాస ఎంపీలు వెనక్కు తగ్గారు... కాని అన్నడీయంకే కొనసాగిస్తూనే ఉంది... దేశంలో అన్ని పార్టీలు, ఈ రెండు పార్టీల చేత, బీజేపీనే గోల చేస్తుంది అని విమర్శలు కూడా చేసాయి... ఈ రోజు, అన్ని దక్షినాది రాష్ట్రాలు సమావేశం అయ్యి, కేంద్రం పై ఒత్తిడి తెస్తుంటే, తెలంగాణ, తమిళనాడు డుమ్మా కొట్టాయి... దీంతో, పూర్తి క్లారిటీ వచ్చేసింది... కేరళలో భేటీకి వెళ్లడం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం కూడా ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించింది. ఆర్థికమంత్రి పన్నీర్‌సెల్వం ఈ సమావేశానికి వెళ్తారని తొలుత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సమావేశానికి ఒక్కరోజు ముందు తమిళనాడు ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది.

modi 10042018

ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఐదేళ్ల పాటు నిధుల వస్తాయి కాబట్టి.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు, నిధుల కేటాయింపులో మొదటి నుంచీ పకడ్బందీగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు... రెవెన్యూ లోటు నిధిని రద్దు చేసే ఆలోచన.. 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో ఉండటంతో.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర అధికారులు చెప్పారు. రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో కొన్ని సవరణలు అవసరమని.. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా ఉంది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల ఏపీకి జరుగుతున్న నష్టం.. దక్షిణాదికి పనికి రాని కేంద్రం పథకాలు.. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలవల్ల జరిగే నష్టాలపై మన రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు వివరిస్తారని సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read